AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bheems Ceciroleo: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సింప్లిసిటీ.. భీమ్స్ ఉపయోగించే ఈ బైక్ వెనక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ

ప్రస్తుత టాలీవుడ్ లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో భీమ్స్ సిసిరోలియో ఒకరు. రవితేజ నటించిన 'ధమాకా’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సంగీత దర్శకుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల లిస్టులోకి చేరిపోయారు. ముఖ్యంగా మాస్ బీట్స్, ఫోక్ ట్యూన్స్ విషయంలో భీమ్స్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

Bheems Ceciroleo: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సింప్లిసిటీ.. భీమ్స్ ఉపయోగించే ఈ బైక్ వెనక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ
Bheems Ceciroleo
Basha Shek
|

Updated on: Nov 06, 2026 | 5:58 PM

Share

సాధారణంగా సినిమా సెలబ్రిటీలన్నాక లగ్జరీ లైఫ్ ఉంటుంది. ఉండడానికి విలాసవంతమైన భవనాలు, తిరగడానికి లగ్జరీ కార్లు ఉంటాయి. ప్రస్తుతం చిన్న చిన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కూడా కార్లలోనే తిరుగుతున్నారు. అయితే ఎంత స్టార్ డమ్ ఉన్నా కొందరు నిరాడంబరంగా ఉంటారు. చాలా సింపుల్ గా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో. ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన భీమ్స్ చాలా సాధారణ లైఫ్‌ స్టైల్‌ పాటిస్తుంటారు. మాస్ బీట్స్, ఫోక్ ట్యూన్స్ తో అదరగొట్టే ఆయన తాజాగా మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు. లగ్జరీ కార్లకు బదులుగా ఇప్పటికీ హీరోహెచ్‌ఎఫ్‌ డీలక్స్ బైక్‌ పై తిరుగుతూ అందరి దృష్టిని ఆకర్షించారు భీమ్స్. ఈ బైక్‌పైనే అన్నపూర్ణ స్టూడియోకు వచ్చి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే ఈ బైక్ వెనుక ఓ ఆసక్తికరమైన స్టోరీ కూడా ఉంది. అదేంటంటే.. ఇది తన తండ్రి బైక్ అని స్వయంగా చెప్పుకొచ్చారు భీమ్స్. నిరాడంబరంగా జీవించడమే తనకు ఇష్టమని, అందుకే ఇప్పటికీ హెచ్ ఎఫ్ డీలక్స్ బైక్ నే వాడుతున్నానంటున్నారీ మ్యూజిక్ డైరెక్టర్.

కాగా కెరీర్ ప్రారంభంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు భీమ్స్. సంగీతంపై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట పెద్దగా అవకాశాలు రాలేదు. బ్రేక్ రావడానికి చాలా సమయమే పట్టింది. రవితేజ నటించిన ధమాకా సినిమా భీమ్స్ కు మంచి గుర్తింపు తీసుకొస్తుంది. అందులోని పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలవడంతో భీమ్స్ కు ఒక్కసారిగా అవకాశాలు పెరిగాయి. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయారు భీమ్స్. ప్రస్తుతం తెలుగులో మాస్ బీట్స్, ఫోక్ ట్యూన్స్ కు ఈ మ్యూజిక్ డైరెక్టర్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. ప్రస్తుతం భీమ్స్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’, శర్వానంద్ భోగీ సినిమాలతో పాటు పలు చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు భీమ్స్.

ఇవి కూడా చదవండి

తండ్రి బైక్ పై భీమ్స్.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us