AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కలెక్టర్‌ ఫొటోతో ఆర్డీవోను బురిడి కొట్టిచ్చిన కేటుగాళ్లు.. రూ. 50 వేలు స్వాహా..

సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పోలీసులు, సైబర్‌ నిపుణులు ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతోన్నా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఓ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో జరిగింది. ఈసారి సైబర్ నేరస్థులు ఏకంగా ఆర్డీవోనే టార్గెట్‌ చేశారు. వివరాల్లోకి..

Andhra Pradesh: కలెక్టర్‌ ఫొటోతో ఆర్డీవోను బురిడి కొట్టిచ్చిన కేటుగాళ్లు.. రూ. 50 వేలు స్వాహా..
Andhrapradesh
Narender Vaitla
|

Updated on: Feb 25, 2023 | 9:00 AM

Share

సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పోలీసులు, సైబర్‌ నిపుణులు ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతోన్నా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఓ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో జరిగింది. ఈసారి సైబర్ నేరస్థులు ఏకంగా ఆర్డీవోనే టార్గెట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. అనకాపల్లికి చెందిన ఆర్డీవో చిన్నికృష్ణకు కలెక్టర్‌ ఫొటోతో షాపింగ్‌ గిఫ్ట్‌ కార్డు వచ్చింది. ఆ గిఫ్ట్‌ కార్డుపై రూ. 50 వేలు చెల్లించాలని అవతలి వ్యక్తి కోరారు. దీంతో కలెక్టర్‌ నుంచి వచ్చిందనో, మరే కారణమో కానీ వెనకా ముందు ఆలోచించని ఆర్డీవో వెంటనే రూ. 50 వేలు పంపించేశాడు.

అయితే ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని కంగుతిన్నాడా ఆర్డీవో. గిఫ్ట్‌ కార్డ్‌ అందిందా అంటూ వాకబు చేయడంతో అదంతా ఫేక్‌ అని తేలింది. దీంతో మోసపోయానని గ్రహించిన ఆర్డీవో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కలెక్టర్‌ పేరుతో మోసం జరగడంతో పోలీసులు వేగంగా స్పందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు డెహ్రాడూన్‌లో సైబర్‌ నేరగాళ్లను అరెస్ట్‌ చేశారు. ఇదంతా బాగానే ఉన్నా అసలు ప్రశ్నలు ఇక్కడే ఉత్పన్నమవుతున్నాయి.

కలెక్టర్‌కు ఆర్డీవో గిఫ్ట్ కార్డ్ పంపడమేంటి.? కలెక్టర్‌నో, ఆయన సిబ్బందినో ఆర్డీవో ఎంక్వైరీ చేసి ఉండొచ్చు కదా.? అనే ప్రశ్నలు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్ ఫోటో చూపించి గిఫ్ట్‌ కార్డ్ పంపండి అంటే ఆర్డీవో పంపించేశారు తప్పితే.. నేనెందుకు పంపాలి అని ఆలోచించలేదు. జిల్లా కలెక్టర్‌నో, ఆయన బిజీగా ఉంటే ఆయన కార్యాలయం సిబ్బందినో కనీసం సంప్రదించలేదు. దీంతో ఈ అంశం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో