BV Raghavulu: సీపీఎం నేత రాఘవులు సంచలన నిర్ణయం.. పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా.. కారణమిదే

సీపీఎం పార్టీ సీనియర్‌ నేత రాఘవులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అత్యున్నతకమిటీ పొలిట్‌ బ్యూరో సభ్యత్వానికి ఆయన రిజైన్‌ చేశారు. ప్రాథమిక సభ్యత్వం మినహా అన్ని పదవులకు రాఘువులు రాజీనామా చేశారు.

BV Raghavulu: సీపీఎం నేత రాఘవులు సంచలన నిర్ణయం.. పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా.. కారణమిదే
Bv Raghavulu
Follow us

|

Updated on: Mar 24, 2023 | 1:12 PM

సీపీఎం పార్టీ సీనియర్‌ నేత రాఘవులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అత్యున్నతకమిటీ పొలిట్‌ బ్యూరో సభ్యత్వానికి ఆయన రిజైన్‌ చేశారు. ప్రాథమిక సభ్యత్వం మినహా అన్ని పదవులకు రాఘువులు రాజీనామా చేశారు. దీంతో రాజీనామా వెనక్కి తీసుకోవాలని అగ్రనేతలు రాఘవులును బుజ్జగిస్తున్నారు. అయినా వెనక్కు తగ్గని రాఘువులు సాధారణ కార్యకర్తగా క్షేత్రస్థాయిలో పనిచేస్తానని వారికి చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వరుస ఫిర్యాదులతోనే రాఘవులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే రాఘవులు రాజీనామాను పార్టీ పొలిట్ బ్యూరో ఇప్పటివరకూ ఆమోదించలేదు. ఏపీలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు కూడా ఆయన రాజీనామాకు కారణమని పార్టీ వర్గాలంటున్నాయి. ఏపీలో పార్టీ యాక్టీవ్‌గా లేదని.. ఇప్పుడు పార్టీ నాయకత్వంలోనూ వర్గ పోరు నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే గఫూర్‌ ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కమిటీ విషయంలోనే వచ్చిన విబేధాలు రాఘవుల రాజీనామాకు కారణమంటున్నారు.

సీపీఎం అనుబంధ విద్యార్ధి సంఘం ఎస్‌ఎఫ్ఐ నుంచి ఎదిగిన రాఘవులు పార్టీలో అనేక కీలకపదవులు చేపట్టారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించారు. సీపీఎం సంస్థాగత ర్మాణంలో రాఘవులు కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన ఉద్యమాలు మంచి గుర్తింపు పొందాయి. మలివిడత భూ ఉద్యమాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. దీంతో జాతీయ స్థాయిలోనూ రాఘవులకు పార్టీలో మంచి గుర్తింపు వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు