Andhra Pradesh: ఏపీలో ఒక్కపూట బడులపై క్లారిటీ.. టైమింగ్స్ ఇవే.. అన్నం తిన్నాకే ఇంటికి..
ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ మొదటి వారం నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించనున్నారు. ఏప్రిల్ చివరి వరకు ఒంటిపూట బడులు కొనసాగించి.. ఆపై వేసవి సెలవులు ఇవ్వనున్నారు.
తెలంగాణలో ఒంటి పూట బడులు ప్రారంభించి.. 10 రోజులు దాటిపోయింది. మరి ఏపీలో ఎప్పుడు.. ఇప్పుడు ఇదే ప్రశ్న… అటు తల్లి దండ్రుల్లో, స్టూడెంట్స్‌లో కలుగుతుంది. విద్యాశాఖ నుంచి ఇప్పటి వరకు అయితే అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు. అయితే ఆ విభాగానికి చెందిన ఉన్నతాధికారులను.. సమాచారం కోరగా.. వారు క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 3 నుంచి.. ఆంధ్రాలో 10వ తరగతి పరీక్షలు జరగున్నాయి. అదే రోజు 1 నుంచి 9 తరగతుల పిల్లలకు.. ఒంటి పూట బడులు పెట్టనున్నట్లు వివరించారు. హాఫ్ డే స్కూల్స్ సమయంలో ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లేదా ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 వరకు పాఠశాలల నిర్వహణ ఉండే అవకాశం ఉంది.
ఏప్రిల్ 30 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చే ఛాన్స్ ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. మళ్లీ జూన్ 12 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ అవుతాయి. దాదాపు 45 రోజులు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. ఒక్కపూట బడికి వచ్చే విద్యార్థులకు స్కూల్ ముగిసిన తర్వాత మధ్యాహ్న భోజనం పెట్టి ఇంటికి పంపిస్తారు. ఇక పిల్లలకు ఎండ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాాలని.. అన్ని క్లాస్ రూమ్స్‌లో ఫ్యానులు తిరిగేలా.. మంచి నీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి.
3వ తేదీ నుంచి 10 పరీక్షలు…
ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3 నుంచి జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. హాల్‌టిక్కెట్లు ప్రస్తుం SSC తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు ఎగ్జామ్స్ నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 3: ఫస్ట్ లాంగ్వేజ్, ఏప్రిల్ 6: సెకండ్ లాంగ్వేజ్, ఏప్రిల్ 8: ఇంగ్లీష్, ఏప్రిల్ 10: మ్యాథ్స్, ఏప్రిల్ 13: సైన్స్, ఏప్రిల్ 15: సోషల్, ఏప్రిల్ 17: కాంపోజిట్ కోర్సు, ఏప్రిల్ 18: వొకేషనల్ కోర్సు ఎగ్జామ్ జరగనుంది. SSC వెబ్‌సైట్‌లో స్టూడెంట్స్ తమ జిల్లా పేరు, స్కూల్ పేరు, బర్త్ డేట్ ఎంటర్ చేసి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..