AP Elections 2024: ఆ మూడు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు.. CPI నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు..
AP Elections 2024: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పొత్తుల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రభుత్వ ఓటును చీలనివ్వబోనంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అంతా అనుకున్నట్లు జరిగితే టీడీపీ, జనసేన, బీజేపీ వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ఇటీవల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికల పొత్తులపై సిపిఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
AP Politics: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పొత్తుల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రభుత్వ ఓటును చీలనివ్వబోనంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అంతా అనుకున్నట్లు జరిగితే టీడీపీ, జనసేన, బీజేపీ వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ఇటీవల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికల పొత్తులపై సిపిఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ,టీడీపీ,జనసేన కలిసి పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నాయని అన్నారు. అయితే ఈ కూటమి వచ్చినా రాష్ట్రంలో లాభం ఉండదని అభిప్రాయపడ్డారు. బీజేపీ వ్యతిరేక ఓటు వైసీపీకి పడుతుందని అభిప్రాయపడ్డారు. టీడీపీ, బీజేపీ, జనసేన మూడు కలిస్తే.. ఎన్నికల్లో క్రిస్టియన్లు, మైనార్టీలు జగన్‌కి ఓట్లు వేసే పరిస్థితి ఉందన్నారు. అప్పుడు జగన్ మళ్లీ గెలుస్తారని జోస్యం చెప్పారు. జగన్ రాజకీయ దత్త పుత్రుడన్న నారాయణ..మోదీ కాళ్ళ దగ్గర జగన్ ఉన్నారంటూ నారాయణ విమర్శించారు.
ఏపీలో పొత్తులపై సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే.. వామపక్షాలు ఎటు వైపు నిలుస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. మేము ఒంటరిగానే పోటీ చేస్తామని వైసీపీ నేతలు పదేపదే చెబుతున్నారు. విపక్షాలు కూడా ఒంటరిగా పోటీ చేయాలంటూ సవాలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే.. ఉభయ వామపక్షాలు ఒంటరిగా బరిలో నిలవాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..