ఎంత పని చేశారు.. వావివరుసలు మరిచి ప్రేమలో పడ్డ జంట.. చివరికి ఇలా..!
ఆమెకు వివాహమైంది. కుటుంబ కలహాలతో భర్తను వదిలేసి పుట్టింట్లో ఉంటోంది. వావివరుసలు మరిచి, సోదరుడి వరుసయ్యే యువకుడితో ప్రేమలో పడింది. భర్తకు విడాకులిచ్చి అతడిని పెళ్ళి చేసుకునేందుకు సిద్దమైంది. అయితే ఇది అనైతికమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు వీరి బంధానికి నిరాకరించారు. దీంతో బతికుంటే తమను విడదీస్తారని, మరణం కూడా తమను విడదీయరాదని భావించిన ఆ జంట ఒకే ఉరి తాడుపై జంటగా వేలాడి ఆత్మహత్య చేసుకున్నారు.

ఆమెకు వివాహమైంది. కుటుంబ కలహాలతో భర్తను వదిలేసి పుట్టింట్లో ఉంటోంది. వావివరుసలు మరిచి, సోదరుడి వరుసయ్యే యువకుడితో ప్రేమలో పడింది. భర్తకు విడాకులిచ్చి అతడిని పెళ్ళి చేసుకునేందుకు సిద్దమైంది. అయితే ఇది అనైతికమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు వీరి బంధానికి నిరాకరించారు. దీంతో బతికుంటే తమను విడదీస్తారని, మరణం కూడా తమను విడదీయరాదని భావించిన ఆ జంట ఒకే ఉరి తాడుపై జంటగా వేలాడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాధ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లె సమీపంలోని నిర్మానుష ప్రదేశంలో చెట్టుకు ఓ జంట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందిన కంబగిరి రాముడు, భారతిగా గుర్తించారు. ఈ జంటకు కొన్ని సంవత్సరాలుగా సన్నిహిత సంబంధాలు ఏర్పడి అది ప్రేమగా మారింది. కానీ అప్పటికే భారతికి వేరే వ్యక్తితో వివాహం జరగడంతో పెద్దలు మందలించారు.
రాముడిపై పెంచుకున్న ప్రేమతో భారతి భర్తకు దూరంగా రెండు సంవత్సరాల నుంచి పుట్టింట్లో ఉంటుంది. భారతి వరసకు రాముడికి చెల్లెలు కావడంతో పెద్దలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురిని విడదీస్తారని భయంతో నంద్యాల నుంచి శనివారం(జూలై 05) రాత్రి కొమరోలు మండలం అక్కపల్లె సమీపంలోకి వచ్చి భారతి, రాముడు చెట్టుకురి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాముడు కట్టుకున్న లుంగీతోనే ఇద్దరూ ఉరి వేసుకున్నారు. మృతుడు ఆత్మహత్య చేసుకునే ముందు వాట్సాప్ లో ఆత్మహత్య చేసుకున్న లోకేషన్ ని తన తండ్రికి పంపి ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..