Corona: ఆంధ్రప్రదేశ్‌లో జూలై నాటికి కరోనా తగ్గుముఖం.!! అధ్యయనంలో బయటపడ్డ ఆసక్తికర విషయాలు.!

Corona Outbreak AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ప్రతీ రోజూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి...

Corona: ఆంధ్రప్రదేశ్‌లో జూలై నాటికి కరోనా తగ్గుముఖం.!! అధ్యయనంలో బయటపడ్డ ఆసక్తికర విషయాలు.!
Corona
Follow us
Ravi Kiran

|

Updated on: May 18, 2021 | 4:31 PM

Corona Outbreak AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ప్రతీ రోజూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రజలకు ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ (డీమ్డ్‌ వర్సిటీ) ప్రొఫెసర్లు, విద్యార్థులు ఊరటను ఇచ్చే వార్తను వెల్లడించారు. జూలై 15 నాటికి రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని స్పష్టం చేశారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ విశ్లేషణ బృందం చేసిన ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. తాజాగా దానికి సంబంధించిన నివేదికను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సీఎం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌కు పంపించారు.

నివేదికలో వివరాలు ఇలా ఉన్నాయి…

రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖంపై ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ (డీమ్డ్‌ వర్సిటీ) ప్రొఫెసర్లు, విద్యార్థులు శాస్త్రీయంగా నివేదికను తయారు చేశారు. ఎస్‌ఎస్‌ఐఆర్‌ (సస్పెక్టబుల్, ఇన్ఫెక్టెడ్‌ అండ్‌ రికవరీ మోడల్‌)సాయంతో మెషీన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్‌‌ డేటాను రూపొందించారు.

ఎస్‌ఆర్‌ఎం నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో మే 21వ తేదీ నాటికి 10 వేల కేసులు, మే 30 నాటికి  5 వేల కేసులు, జూన్ 14 నాటికి వెయ్యి కేసులు.. జూలై నాటికి 500 కేసులు నమోదయ్యే అవకాశముందని ఎస్‌ఆర్‌ఎం రిపోర్ట్ అంచనా వేస్తోంది. అలాగే జూలై 15వ తేదీ నాటికి 100 కంటే తక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని నివేదికలో పేర్కొన్నారు. మార్చి 3వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ఆధారంగా ఎస్‌ఆర్‌ఎం విద్యార్థులు.. తాము రూపొందించిన డేటాను ఉపయోగించి ఈ విశ్లేషణను జరిపారు.

ఏపీలో తాజాగా నమోదైన పాజిటివ్ కేసులు ఇలా ఉన్నాయి…

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18వేలు దాటింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 73,749 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 18,561 మందికి కరోనా పాజిటివ్‌‌గా తేలింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 14,54,052 మందికి కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఇక, నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 109 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 9,481కు చేరింది. గడిచిన 24 గంటల్లో 17,334 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు 12 లక్షల 33 వేల 017 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 2,11,554 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Also Read:

 ఏటీఎంలో డబ్బును ఇలా కూడా డ్రా చేయొచ్చా.. యువతి చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో..

అద్భుతమైన పోస్టాఫీస్ స్కీ‌మ్.. ప్రతీ నెలా రూ. 5042 కడితే.. రూ. 7.25 లక్షలు పొందొచ్చు..