AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress: ఆంధ్రప్రదేశ్ కోసం యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్న కాంగ్రెస్‌.. 21న ఢిల్లీలో స్ట్రాటజీ మీటింగ్‌..

తెలంగాణ విజయంతో ఊపు మీదున్న కాంగ్రెస్‌.. పక్కా ప్లాన్‌తో వస్తాం.. ఏపీలో కూడా గట్టిగా కొడతాం అంటోంది. ఇన్నాళ్లూ నిస్తేజంగా, నీరసంగా ఉన్న కాంగ్రెస్‌, వై నాట్‌ ఏపీ అంటోంది. ఏపీ ఎన్నికలకు యాక్షన్‌ ప్లాన్‌తో రెడీ అంటోంది. విజయవాడలో జరుగుతున్న పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశాల్లో పార్టీని ఏపీలో సంస్థాగతంగా ఎలా బలోపేతం చేయాలో చర్చించారు కాంగ్రెస్‌ నేతలు.

Congress: ఆంధ్రప్రదేశ్ కోసం యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్న కాంగ్రెస్‌.. 21న ఢిల్లీలో స్ట్రాటజీ మీటింగ్‌..
AP Congress
Shaik Madar Saheb
|

Updated on: Dec 14, 2023 | 9:37 PM

Share

తెలంగాణ విజయంతో ఊపు మీదున్న కాంగ్రెస్‌.. పక్కా ప్లాన్‌తో వస్తాం.. ఏపీలో కూడా గట్టిగా కొడతాం అంటోంది. ఇన్నాళ్లూ నిస్తేజంగా, నీరసంగా ఉన్న కాంగ్రెస్‌, వై నాట్‌ ఏపీ అంటోంది. ఏపీ ఎన్నికలకు యాక్షన్‌ ప్లాన్‌తో రెడీ అంటోంది. విజయవాడలో జరుగుతున్న పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశాల్లో పార్టీని ఏపీలో సంస్థాగతంగా ఎలా బలోపేతం చేయాలో చర్చించారు కాంగ్రెస్‌ నేతలు. ఈ నెల 21న ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాలపై ఢిల్లీలో స్ట్రాటజీ మీటింగ్‌ జరుగుతుందన్నారు గిడుగు. మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో ఏపీలో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధమవుతుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.

ఏపీలో పొలిటికల్ వాక్యూమ్ ఉందంటుని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. చంద్రబాబు, జగన్ పాలనను ప్రజలు చూశారని, విభజన హామీల కోసం ఆ పార్టీలు పనిచేయలేదని ప్రజలు గుర్తించారని, ఈసారి తమకు పట్టం కడతారంటున్నారు ఆయన. దీనికోసం జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్లు సిద్ధం చేస్తున్నామన్నారు.

ఇక చాలామంది వైసీపీ నేతలు తమతో టచ్‌లో ఉన్నారంటున్నారు పీసీసీ చీఫ్‌ గిడుగు. వారిలో ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారంటున్నారు. రాబోయే ఎన్నికల్లో భావ సారూప్యత ఉన్న పార్టీలతో కలిసి పని చేస్తామంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. గిడుగు మాటలు పిడుగుల్లా ఉన్నా.. అవి ఎంతవరకు వర్కౌట్‌ అవుతాయో చూడాలంటున్నారు విశ్లేషకులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..