AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 రూపాయలతో క్యూలో నిలబడి అల్పాహారం చేసిన జిల్లా కలెక్టర్..

అల్పాహారం కోసం వచ్చిన ప్రజలతో ఆప్యాయంగా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడారు..ఆహారం నాణ్యత , రుచి , వేడి , అందుబాటులాంటివి వివరంగా తెలుసుకున్నారు.. క్యాంటీన్ లోని ఆహార పదార్థాలు పట్టిక టోకెన్ కౌంటర్ , డైనింగ్ ఏరియా తాగునీటి నాణ్యతను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు..

5 రూపాయలతో క్యూలో నిలబడి అల్పాహారం చేసిన జిల్లా కలెక్టర్..
Collector Lakshmi Shah's
M Sivakumar
| Edited By: |

Updated on: Nov 20, 2025 | 9:29 PM

Share

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ల నిర్వహణపై ఆకస్మీక తనిఖీలు చేపట్టారు ఎన్టీఆర్‌ జిల్ల కలెక్టర్‌ లక్ష్మీశా. విజయవాడ పడమట హైస్కూల్ రోడ్ లోని అన్న క్యాంటీన్ ను ఆకస్మికంగా సందర్శించారు. అక్కడి నిర్వహణను ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఐదు రూపాయలు చెల్లించి ప్రజలతో కలిసి క్యూ లైన్ లో నిలబడి అల్పాహారం తీసుకున్నారు..

అల్పాహారం కోసం వచ్చిన ప్రజలతో ఆప్యాయంగా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడారు..ఆహారం నాణ్యత , రుచి , వేడి , అందుబాటులాంటివి వివరంగా తెలుసుకున్నారు.. క్యాంటీన్ లోని ఆహార పదార్థాలు పట్టిక టోకెన్ కౌంటర్ , డైనింగ్ ఏరియా తాగునీటి నాణ్యతను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు..

అన్నా క్యాంటీన్ లోని పరిశుభ్రతపై స్పష్టమైన హెచ్చరికలను కూడా సిబ్బందికి జారీ చేశారు.. క్యాంటీన్ నిర్వాహకులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ..పరిసరాలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు.అపరిశుభ్రత అనేది కనిపించకూడదు.మెనూ ప్రకారం ఆహారం అందుబాటులో ఉండాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశాలు జారీ చేశారు..

ఇవి కూడా చదవండి

ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం ఎంతో పవిత్రమైన సేవ.. అలాంటి మంచి కార్యక్రమంలో పని చేయడం అదృష్టమని నిబద్ధతతో సేవ చేయాలని కలెక్టర్ తెలిపారు..

అన్న క్యాంటీన్ సేవలపై ప్రజా అభిప్రాయాలను సేకరించేందుకు క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.. ప్రజల అభిప్రాయాలు ఆధారంగా సేవలను మరింత మెరుగుపరుస్తామని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.  

రోజుకు నగదు లావాదేవీల పరిమితి ఎంత? ఈ లిమిట్‌ దాటితే జరిమానా!
రోజుకు నగదు లావాదేవీల పరిమితి ఎంత? ఈ లిమిట్‌ దాటితే జరిమానా!
కోదండ రాముడి విల్లు పై ఏమేం చెక్కారో తెలుసా..?
కోదండ రాముడి విల్లు పై ఏమేం చెక్కారో తెలుసా..?
అడవి బిడ్డల అద్భుత పండుగ.. గ్రామస్తుల ఐక్యతను చాటిచెప్పే వేడుక
అడవి బిడ్డల అద్భుత పండుగ.. గ్రామస్తుల ఐక్యతను చాటిచెప్పే వేడుక
హైదరాబాద్ గడ్డపై ఊచకోత..డబుల్ సెంచరీతో సెలక్టర్లకు గట్టి మెసేజ్
హైదరాబాద్ గడ్డపై ఊచకోత..డబుల్ సెంచరీతో సెలక్టర్లకు గట్టి మెసేజ్
మద్య నిషేధం చేద్దామన్న సర్పంచ్.. మందుబాబుల స్టన్నింగ్ క్వచ్చన్
మద్య నిషేధం చేద్దామన్న సర్పంచ్.. మందుబాబుల స్టన్నింగ్ క్వచ్చన్
మారిన ట్రాఫిక్ రూల్స్.. వాహనదారుల్లారా బీకేర్‌ఫుల్..!
మారిన ట్రాఫిక్ రూల్స్.. వాహనదారుల్లారా బీకేర్‌ఫుల్..!
దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్‌ సూసైడ్‌! ముగ్గురు మృతి
దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్‌ సూసైడ్‌! ముగ్గురు మృతి
ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో మీ గ్యాస్ స్టౌ అద్దంలా మెరవాల్సిందే
ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో మీ గ్యాస్ స్టౌ అద్దంలా మెరవాల్సిందే
Viral Video: మొసలి నోట్లో చేయి పెట్టాడు.. ఆ తర్వాత షాకింగ్ సీన్..
Viral Video: మొసలి నోట్లో చేయి పెట్టాడు.. ఆ తర్వాత షాకింగ్ సీన్..
ఆరెంజ్ పండ్లు వీరికి విషంతో సమానం.. తిన్నారో సమస్యలు..
ఆరెంజ్ పండ్లు వీరికి విషంతో సమానం.. తిన్నారో సమస్యలు..