Andhra Pradesh: ఏపీలో ఘోరం.. ప్రత్యర్థి పార్టీకి మద్దతిచ్చాడని కొబ్బరితోటలో వంద చెట్లు నరికి విధ్వంసం
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం వెళ్దూరులో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. గ్రామానికి చెందిన వెంకటయ్యరెడ్డికి చెందిన కొబ్బరి తోటను
Coconut Trees cut down: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం వెళ్దూరులో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. గ్రామానికి చెందిన వెంకటయ్యరెడ్డికి చెందిన కొబ్బరి తోటను నరికి విధ్వంసం సృష్టించింది ప్రత్యర్థి వర్గం. సుమారు వంద కొబ్బరి చెట్లను దుండగులు నరికేశారు.
పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ రెబెల్ అభ్యర్థికి, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చాడు బాధితుడు వెంకటయ్య. రాజకీయ కక్షతో వైసీపీ వాళ్లే తమ చెట్లను నరికేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. దీంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.