Vizianagaram: వామ్మో.. మనిషి పొడవున్న నాగుపాము కలెక్టర్ ఆఫీసులో పడగ విప్పింది.. దాని కడుపులో
ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం పెద్ద పెద్ద కొండ నాగులు, తాచుపాములు, ప్రమాదకర కట్లపాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలకు సమీప ప్రాంతాల్లో నివశించేవారు అప్రమత్తంగా ఉండాలి. తాజాగా...

ప్రజంట్ సమ్మర్ సీజన్ నడుస్తుంది. ఎండలు అదరగొడుతున్నాయి. 10 దాటాక బయటకు పోతే మాడు పగిలిపోతుంది. వేడికి, ఉక్కపోతకి శరీరం డీ హైట్రెట్ అయ్యి.. దాహం ఎక్కువ వేస్తుంది. మనం అంటే ఎలా అంటే అలా వాటర్ తాగేస్తాం. కానీ వన్యప్రాణాల పరిస్థితి ఏంటి..? ఈ వడగాల్పులకు అవి ఎన్నో ఇబ్బందులు పడతాయి. కాలువలు, మడుగులు, చెలమల్లోని నీళ్లని ఇంకిపోతాయి. దీంతో అవి దాహంతో నీటిని వెతుక్కుంటూ జన సంచారం ఉన్న ప్రాంతాలవైపు వస్తాయి. ఈ మధ్యకాలంలో జింకలు, అడవి పందులు, చిరుత పులులు ఇలా జనావాసాల్లోకి వచ్చిన ఘటనలు మనం చూశాం. ఇప్పుడు పాముల వంతు మొదలయ్యింది.
ఈ మధ్య కాలంలో పెద్ద, పెద్ద పాములు గ్రామాల్లో, పట్టణాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇళ్లల్లోకి, కార్యాలయాల్లోకి దూరుతూ అందర్నీ టెన్షన్ పెడుతున్నాయి. పాము కనపడితే అక్కడ ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎటోళ్లు అటు పారిపోతారు. స్నేక్ క్యాచర్ లేదా ఫారెస్ట్ సిబ్బంది వచ్చి దాన్ని రెస్క్యూ చేసేవరుకు అక్కడ సీన్ సితార అవుతుంది. తాజాగా అలాంటి ఘటనే విజయనగరం కలక్టరేట్‌లో వెలుగుచూసింది. ఓ భారీ నాగుపాము డీఈఓ ఆఫీస్ వద్ద ప్రత్యక్షమైంది. దీంతో అక్కడి సిబ్బంది కంగారుతో పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వడంతో.. అతడు వచ్చి దాన్ని జాగ్రత్తగా బంధించాడు. కాగా ఆ పాము ఎలుకలు మింగడంతో.. పొట్ట భారం అయ్యి.. కదిలేందుకు ఇబ్బంది పడిందని స్నేక్ క్యాచర్ తెలిపాడు. దాన్ని సురక్షిత ప్రాంతంలో వదిలిపెడతానని చెప్పాడు.
పాములు కనపడగానే వాటిని చంపకూడదు. ఇలా పాములు పట్టేవాళ్లకు లేదా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్లకు సమాచారం ఇవ్వాలి. దానికి కూడా ఈ భూమిపై బ్రతికేందుకు సమాన హక్కు ఉంది. పాములు.. వాటికి డేంజర్ అని ఫీల్ అయినప్పుడు మాత్రమే కాటు వేస్తాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
