CM Jagan: విద్యార్థులకు ఉచితంగా ట్యాబుల పంపిణీ చేసిన సీఎం జగన్.. అందులో ఏలాంటి కంటెంట్ ఉంటుందో తెలుసా..
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఏపీ సీఎం వైఎస్ జగన్ బహిరంగసభను నిర్వహించారు. తన పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు ట్యాబుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సభ ప్రారంభంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పిల్లలే మన వెలుగులు, వీరే మన భవిష్యత్తు అని చెప్పుకొచ్చారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఏపీ సీఎం వైఎస్ జగన్ బహిరంగసభను నిర్వహించారు. తన పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు ట్యాబుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సభ ప్రారంభంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పిల్లలే మన వెలుగులు, వీరే మన భవిష్యత్తు అని చెప్పుకొచ్చారు. ప్రపంచంతో పోటీపడే పరిస్థితులు ఉండాలి, అందులో మన పిల్లలు గెలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన 55 నెలలుగా మన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసిందన్నారు. 10 రోజులపాటు ప్రతి మండలపరిధిలో 8వ తరగతి పిల్లలకు ట్యాబులిచ్చే కార్యక్రమం జరుగుతుందని ఇందులో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు. 4.35 లక్షల మంది పిల్లలకు ట్యాబులను పంపిణీచేస్తున్నాం. డిజిటల్ విప్లవంలో భాగంగా గతేడాది కూడా నా పుట్టినరోజునే 686 కోట్లతో 5.18లక్షల ట్యాబులను విద్యార్థులకు, చదువులు చెప్తున్న టీచర్లకు పంపిణీచేశాం.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను ఉచితంగా పంపిణీ చేశారు. ఇప్పుడు అందించే ట్యాబ్‌లలో 11,12 తరగతుల కంటెంట్ కూడా లోడ్ చేసేలా ట్యాబ్ మెమరీ కార్డ్ సామర్థ్యం 256జీబీకి పెంచి అందిస్తున్నారు. పిల్లల చేతుల్లో పెట్టే ఈ ట్యాబు మార్కెట్ విలువ రూ.17,500 అని దీంతోపాటు శ్రీమంతుల పిల్లలు మాత్రమే కొనుక్కునే రూ.16వేల విలువైన బైజూస్ కంటెంట్‌ను ఉచితంగా ట్యాబుల్లోకి డౌన్లోడ్ చేసి అందిస్తున్నామన్నారు. కంటెంట్ విలువతో కలుపుకుని అక్షరాల రూ.33వేలు అవుతుందని చెప్పారు. వీటన్నింటితో పాటూ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా 1 నుంచి 5వ తరగతి గదుల్లో ఇంగ్లిషు ల్యాబ్స్ లో 10,035 స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశామన్నారు. దీనికోసం మొదటి దశలో రూ.427 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, టోఫెల్ ప్రిపరేషన్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా అన్ని ట్యాబ్‌ల్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డౌట్ క్లియరెన్స్ బాట్ అప్లికేషన్.. పిల్లలు సులభంగా విదేశీ భాషలు నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి పొందేందుకు వీలుగా డ్యులింగో ఇన్ స్టాల్ చేశారు. పేదరికం నుంచి ప్రజలను బయటకు తీసుకురావాలని ఆరాటపడుతుంటే తమపై కొన్ని పార్టీల నాయకులు, వారి అనుబంధ మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. మీ పిల్లలు, మనవళ్ల చేతిలో ఏమో ట్యాబులు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు కాని పేదల చేతుల్లో మాత్రం ఇవి ఉండకూడదన్నది ప్రతిపక్షాల వాదన అంటూ వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విమర్శలతో విరుచుకు పడ్డారు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి. తమ ప్రభుత్వంలో పేదలకు జరుగుతున్న మంచి.. చంద్రబాబు హయాంలో ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. అప్పుడు దోచుకోవడం, పంచుకోవడమే పనిగా ఉండేదని.. ఇప్పుడు ఎక్కడా అవినీతికి తావు లేకుండా సంక్షేమపథకాలు లబ్దిదారులకు అందుతున్నాయని చెప్పారు.’
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..