Andhra Pradesh: చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్.. 3.95 లక్షల మంది ఖాతాల్లోకి రూ.395 కోట్ల కొత్త రుణాలు

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Jan 10, 2023 | 6:25 PM

Jagananna Thodu: ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్ చెప్పింది. నడ్డి విరిచే వడ్డీలకు చెల్లుచీటీ చెబుతూ చిరు వ్యాపారులకు అండగా ఉండాలన్న సదుద్ధేశంతో ముఖ్యమంత్రి జగన్ జగనన్న తోడు పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

Andhra Pradesh: చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్.. 3.95 లక్షల మంది ఖాతాల్లోకి రూ.395 కోట్ల కొత్త రుణాలు
Andhra Pradesh Cm Jagan

Jagananna Thodu: ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్ చెప్పింది. నడ్డి విరిచే వడ్డీలకు చెల్లుచీటీ చెబుతూ చిరు వ్యాపారులకు అండగా ఉండాలన్న సదుద్ధేశంతో ముఖ్యమంత్రి జగన్ జగనన్న తోడు పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనిలో భాగంగా బుధవారం సీఎం జగన్ కొత్త రుణాలను అందించనున్నారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున 3.95 లక్షల మంది చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి బ్యాంకుల ద్వారా కొత్తగా రూ.395 కోట్లు కొత్త రుణాలు అందించనున్నారు. దీంతోపాటు గత 6 నెలలకు సంబంధించిన రూ.15.17 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కడం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

గ్రామాలు, పట్టణాల్లో సుమారు 5 అడగులు పొడవు, 5 అడుగులు వెడల్పు స్ధలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులు. అలాగే పుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్మకుని జీవించేవారు, రోడ్ల పక్కన టిఫిన్‌ సెంటర్లు నిర్వహించేవారు, గంపలు, బుట్టలలో వస్తువులు అమ్మేవారు, సైకిల్‌, మోటారు సైకిల్‌, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసేవారితో పాటు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులు.. ఇత్తడి పని చేసేవాళ్లు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బమ్మల తయారీ, లేస్‌ వర్క్స్, కలంకారీ, తోలుబొమ్మలు, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారు ఈ పథకానికి అర్హులని అధికారులు తెలిపారు.

జగనన్న తోడు పథకం..

పాదయాత్రలో ఈ చిరు వ్యాపారుల కష్టాలను చూసిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ఆ పరిస్థితులను మారుస్తూ, నిత్య కష్టంపైనే ఆధారపడి, గౌరవంగా జీవిస్తున్న వారిని ఆదుకోవడం కోసం, సున్నా వడ్డీకే రుణాలు అందిస్తూ జగనన్న తోడు పథకం అమలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

దేశంలోనే అత్యధిక రుణాలు..

దేశంలో అత్యధికంగా వడ్డీలేని రుణాలు అందిస్తున్న ప్రభుత్వంగా ఏపీ సర్కార్ నిలిచింది. రేపు (బుధవారం, 11–01–2023) అందిస్తున్న రూ.395 కోట్ల రుణంతో కలిపి ఇప్పటివరకు రూ.15,31,347 మంది చిరు వ్యాపారాలు చేసుకునే లబ్ధిదారులకు అందించిన వడ్డీలేని రుణాలు రూ.2,406 కోట్లుగా అధికారులు తెలిపారు. వీరిలో సకాలంలో రుణాలు చెల్లించి రెండోసారి రుణం కోరి పొందిన వారు 8,74,745 మంది అని వివరించారు.

బుధవారం (11–01–2023) అందిస్తున్న వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ రూ.15.17 కోట్లతో కలిపి సకాలంలో రుణాలు చెల్లించిన 13.28 లక్షల లబ్ధిదారులకు ఇప్పటివరకు ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ రూ.63.65 కోట్లు. అయితే, ఏ ఏడాదికి ఆ ఏడాది రుణాల మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.11 వేలకు, రూ.11 వేల నుంచి రూ.12 వేలకు, రూ.12 వేల నుంచి రూ.13వేలకు పెంచుతూ బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు అందించేలా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu