AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: ఇవాళ విశాఖలో జలవనరుల సంరక్షణ సదస్సు.. హాజరుకానున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..

Global Irrigation Meet: 25వ అంతర్జాతీయ కాంగ్రెస్‌, 74వ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సందర్భంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు..ప్రారంభ కార్యక్రమంలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఈ అంతర్జాతీయ సదస్సు ఇవాళ్టి నుంచి 8 వరకు జరుగుతుంది..ఇందులో 90 దేశాల నుంచి అతిథులు, ఐసీఐడీ, సీడబ్ల్యూసీ ఉన్నతాధికారులు, సభ్యులు హారవుతారన్నారు. కేంద్ర జలసంఘం అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ఐసిఐడిలోని 54 సభ్యదేశాలు, మరో 20అసోసియేట్ సభ్యదేశాల ప్రతినిధులు పాల్గోని వ్యవసాయరంగ సుస్థిరతకోసం ప్రత్యామ్నాయ..

CM Jagan: ఇవాళ విశాఖలో జలవనరుల సంరక్షణ సదస్సు.. హాజరుకానున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..
CM Jagan
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 02, 2023 | 9:52 AM

విశాఖ, నవంబర్ 02: జలవనరుల సంరక్షణపై నేడు విశాఖలో సదస్సు జరగనుంది..25వ అంతర్జాతీయ కాంగ్రెస్‌, 74వ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సందర్భంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు..ప్రారంభ కార్యక్రమంలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఈ అంతర్జాతీయ సదస్సు ఇవాళ్టి నుంచి 8 వరకు జరుగుతుంది..ఇందులో 90 దేశాల నుంచి అతిథులు, ఐసీఐడీ, సీడబ్ల్యూసీ ఉన్నతాధికారులు, సభ్యులు హారవుతారన్నారు.

కేంద్ర జలసంఘం అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ఐసిఐడిలోని 54 సభ్యదేశాలు, మరో 20అసోసియేట్ సభ్యదేశాల ప్రతినిధులు పాల్గోని వ్యవసాయరంగ సుస్థిరతకోసం ప్రత్యామ్నాయ నీటి వనరులను ఏవిధంగా వినియోగించుకోలన్న అంశాలపై చర్చిస్తారు. సంప్రదాయ నీటివనరులను అభివృద్ది చేయడం, నీటిపారుదల వ్యవస్థలను మెరుగుపరచడం, వర్షపు నీటి సంరక్షణ, పొలాల్లో వర్షపునీటిని ఒడిసి పట్టేందకు మార్గాలు, భూగర్భ జలాల పెంపుదల , మురుగునీటిని శుద్దిచేసి సాగునీటిగా వినియోగించుకునేందుకు ఉన్న మార్గాలు, అధిక దిగుబడులకోసం శుద్ద జలాల వినియోగంపై చర్చిస్తారు..

రైతు సాధికారతర అంశంపై సహకార సంస్థలు, నీటి వినియోగాదరల సంఘాల పాత్ర, వ్యవసాయ విస్తరణ సేవలు, రైతులకు ఉపయోగపడే సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం, వ్యవసాయరంగంలో సాంకేతికను పెంపొందించడం ,వ్యవసాయ పరిశోధనలు ,ఆవిష్కరణలు, స్కాడా తదితర అంశాలపై ప్యానెల్ డిస్కషన్లు జరుగుతాయి..

ICID కాంగ్రెస్ అనేది ఈ రంగంలో ఇప్పటికే ఉన్న ప్రపంచ సమస్యలపై పరిష్కారాలను అభివృద్ధి చేసే ప్రధాన త్రైవార్షిక కార్యక్రమం. INCID తీసుకున్న చొరవ, రాష్ట్ర ప్రభుత్వం నుండి మద్దతు కారణంగా, INCID వెబ్ పోర్టల్ ప్రకారం, ICID ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆరు దశాబ్దాల తర్వాత దేశానికి తిరిగి వచ్చింది.

విశాఖపట్నంలో 25వ కాంగ్రెస్, 75వ IECని నిర్వహించడానికి  2021లో మొరాకోలోని మర్రకేచ్‌లో జరిగిన 5వ ఆఫ్రికన్ ప్రాంతీయ సదస్సులో ఆమోదం లభించింది. నగరంలో జరిగే కాంగ్రెస్, ఇతర ఈవెంట్‌లకు ప్రపంచం నలుమూలల నుండి 1,200 మందికి పైగా పాల్గొనే అవకాశం ఉంది. ఈ నెలాఖరు నుంచి వారం రోజుల పాటు వసతి, భోజనం, రవాణా ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ అధికారులను కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి