Chandrababu Live: బాబుకు వైద్యపరీక్షలు.! నేడు ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు.

Chandrababu Live: బాబుకు వైద్యపరీక్షలు.! నేడు ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు.

Anil kumar poka

| Edited By: TV9 Telugu

Updated on: Nov 02, 2023 | 2:45 PM

స్కీల్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయి 52 రోజుల అనంతరం మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తన నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబు కోసం అప్పటికే ఆయన నివాసంలో ఎదురుచూస్తున్న ఏఐజీ వైద్యుల బృందం ఆయన వచ్చాక ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్య పరమైన ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు.

స్కీల్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయి 52 రోజుల అనంతరం మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తన నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబు కోసం అప్పటికే ఆయన నివాసంలో ఎదురుచూస్తున్న ఏఐజీ వైద్యుల బృందం ఆయన వచ్చాక ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్య పరమైన ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారి సూచన మేరకు ఇవాళ చంద్రబాబు ఏఐజీకి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. వైద్యులు ఆయనకు అవసరమైన పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించనున్నారు. అలాగే ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటి పరీక్షలు కూడా చేయించుకునే అవకాశం ఉంది. తొలుత ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేసే అవకాశం ఉంది. చంద్రబాబు వైద్య పరీక్షలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు..

సీఎం కేసీఆర్‌.. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఇవాళ నిర్మల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించనున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఇంద్రకరణ్‌ రెడ్డికి మద్దతుగా సీఎం కేసీఆర్‌ ప్రచారం నిర్వహిస్తారు. ఇప్పటికే సభా ప్రాంగణం దగ్గర ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కొన్ని రోజులుగా దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.నిన్న సత్తుపల్లి, ఇల్లెందు సభల్లో ప్రసంగించిన కేసీఆర్.. కాంగ్రెస్‌ నేతలకు స్ట్రాంగ్‌ కౌంటర్లు ఇచ్చారు. మరోవైపు సత్తుపల్లి సభలో ఏపీ పరిస్థితులను ప్రస్తావించారు. డబుల్‌ రోడ్డు వస్తే తెలంగాణ.. సింగిల్‌ రోడ్‌ వస్తే ఆంధ్రప్రదేశ్‌ అన్నారు. సరిహద్దుల్లోని ఏపీ ప్రజలు తెలంగాణకు వచ్చి ధాన్యం అమ్ముకుంటున్నారన్నారు. విడిపోతే రాష్ట్రంలో కరెంటు ఉండదని.. నష్టపోతామంటూ శాపాలు పెట్టారని.. ఇప్పుడు ఏపీలోనే చీకట్లు ఉన్నాయన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Published on: Nov 02, 2023 09:26 AM