AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur Murder: రమ్య హత్యపై సీఎం జగన్ సీరియస్.. వెంటనే చర్యలకు ఆదేశం… యువతి కుటుంబానికి రూ.10లక్షల పరిహారం

గుంటూరులో యువతి రమ్య హత్యా ఘటనపై సీఎం జగన్‌ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి...

Guntur Murder: రమ్య హత్యపై సీఎం జగన్ సీరియస్.. వెంటనే చర్యలకు ఆదేశం... యువతి కుటుంబానికి రూ.10లక్షల పరిహారం
Cm Jagan
Ram Naramaneni
|

Updated on: Aug 15, 2021 | 8:44 PM

Share

గుంటూరులో యువతి రమ్య హత్యా ఘటనపై సీఎం జగన్‌ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ‘దిశ’ కింద వేగంగా చర్యలను తీసుకుని దోషికి కఠినశిక్ష పడేలా చేయాలన్నారు.   ఘటన వివరాలు తెలియగానే హోంమంత్రి ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారని, ఆ కుటుంబానికి అండగా నిలబడతామంటూ భరోసా ఇచ్చిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు వెళ్లాల్సిన యువతి.. ఈ విధంగా తనువు చాలించడంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని.. పరిహారంగా రూ.10లక్షలు ఆకుటుంబానికి ఇవ్వాలని సీఎం అధికారులు ఆదేశించారు.

అసలేం జరిగిందంటే… 

ఓ ప్రైవేట్‌ కాలేజీలో బీటెక్‌ థర్డ్ ఇయర్ చదువుతున్న రమ్య కాకాణి రోడ్డులో వెళ్తోంది. అటుగా వచ్చి ఓ యువకుడు తన బైక్‌పై ఎక్కాలని కోరాడు. అందుకు రమ్య నిరాకరించడంతో ఆగ్రహంతో రగిలిపోయాడు. సహనం కోల్పోయి వెంట తెచ్చుకున్న కత్తితో రమ్య మెడ, పొట్ట భాగంలో విచక్షణారహితంగా పొడిచాడు. ఆ తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయాడు. రక్తమోడుతున్న యువతిని స్థానికులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించి రమ్య చనిపోయినట్టు డాక్టర్లు నిర్దారించారు. రమ్య మృతితో కన్నవాళ్లు గుండెలవిసేలా రోధించారు.  రమ్య మృతదేహాన్ని హోంమంత్రి సుచరిత పరిశీలించారు. కుటుంబసభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘాతుకానికి ఒడి గట్టడానికి కారణం ఏంటి? అన్నది తేలాల్సి ఉంది. చదువుల తల్లి మెడపై ఎందుకు కత్తిగట్టాడన్నది తేలాల్సి ఉంది. అయితే రమ్యను హత్య చేసింది శశికృష్ణగా అనుమానిస్తున్నారు పోలీసులు. హత్యకు ముందు 8నిమిషాలు రమ్యతో మాట్లాడినట్టు గుర్తించారు. ఆ తర్వాత నేరుగా ఆమె దగ్గరికి వెళ్లి వాగ్వాదానికి దిగి, హత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నిర్భయలాంటి బలమైన చట్టాలు వచ్చినా ఆడబిడ్డలకు అభయం లేకుండాపోయింది. ఇంటి గడప దాటితే ఎప్పుడు.. ఎవరు.. ఎలా.. దాడి చేస్తారోనన్న ఆందోళన కన్నవాళ్లను కంగారెత్తిస్తోంది.

Also Read: తెలంగాణ రైతులకు అలెర్ట్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ నగదు జమ