Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: తుఫాన్ ప్రభావం ఉండే జిల్లాలకు అందుబాటులో పది కోట్ల నిధులు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

తుఫాన్‌ తరుముకొస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు కునుకు లేకుండా చేస్తోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

CM Jagan: తుఫాన్ ప్రభావం ఉండే జిల్లాలకు అందుబాటులో పది కోట్ల నిధులు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
Cm Jagan On Rains
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 04, 2021 | 8:23 AM

జొవాద్ తుఫాన్‌ తరుముకొస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు కునుకు లేకుండా చేస్తోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు మొదలవగా.. క్రమంగా గాలుల తీవ్రత పెరిగింది. నేడు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో.. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు క్షణమొక యుగంలా గడుపుతున్న పరిస్థితి. బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారిపోయింది. కాకినాడ-ఉప్పాడ ప్రాంతంలో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి.

ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ప్రత్యేక అధికారులతో సమీక్ష చేశారు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి. ఎక్కడ కూడా, ఎలాంటి పరిస్థితుల్లోను ప్రాణనష్టం జరక్కూడదని ఆదేశాలు జారీ చేశారాయన. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఒక్కో జిల్లాకు పది కోట్ల రూపాయల నిధులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సహాయక శిబిరాల్లో తలదాచుకునే బాధితులకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకూడదని సూటిగా చెప్పారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి. ఎక్కడెక్కడ స్పెషల్‌ టీంం‌లు మోహరించాయో తెలుసుకున్నారు. అవసరమైతే మరిన్ని బృందాలు అందుబాటులో ఉండాలని.. అవసరమైతే వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు సీఎం. ఉభయ గోదావరి జిల్లాలకు ప్రమాదం లేకపోయినా.. భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో.. అక్కడ కూడా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

విశాఖ మహా నగరానికి రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన నేపథ్యంలో ప్రత్యేక టీమ్‌లు మోహరించాయి. శ్రీకాకుళం జిల్లాలో ఈదురుగాలల తీవ్రత పెరిగింది. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని.. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు.

Also Read: Viral Photo: ఈ ఫోటోలో ఓ పాము దాగుంది.. కనిపెట్టండి చూద్దాం