AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: అట్టడుగు వర్గాల వారు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలి.. రాష్ట్ర స్థాయిలో టాపర్స్‌‌కు అవార్డులు ప్రదానం చేసిన సీఎం జగన్

రాష్ట్ర స్థాయిలో పదో తరగతిలో టాపర్స్‌గా నిలిచిన 42 మంది, ఇంటర్మీడియట్‌ గ్రూపుల వారీగా సత్తా చాటిన 26 మంది విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు అవార్డులను ప్రదానం చేశారు సీఎం జగన్. ఉన్నత విద్యలో ఐదు కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థులకు స్టేట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులను ప్రదానం చేశారు.

CM Jagan: అట్టడుగు వర్గాల వారు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలి.. రాష్ట్ర స్థాయిలో టాపర్స్‌‌కు అవార్డులు ప్రదానం చేసిన సీఎం జగన్
CM Jagan
Sanjay Kasula
|

Updated on: Jun 20, 2023 | 11:53 AM

Share

విజయవాడ, జూన్ 20: విజయవాడలో జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పదో తరగతిలో రాష్ట్ర స్థాయిలో టాపర్స్‌గా నిలిచిన 42 మంది విద్యార్థులకు, ఇంటర్‌లో సత్తా చాటిన 26 మంది విద్యార్థులకు ఈ అవార్డులను సీఎం జగన్ అందించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థాయిల్లో ప్రతిభ చాటిన 22,710 మంది విద్యార్థులు ఆణిముత్యాల అవార్డులను స్వీకరించారు. ఉన్నత విద్యలో ఐదు కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థులకు స్టేట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులను ప్రదానం చేశారు. ఇంటర్మీడియట్‌ ప్రతి గ్రూపులోను రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన మొత్తం 22,710 మంది విద్యార్థులకు ప్రభుత్వం జగనన్న ఆణిముత్యాలుగా ప్రోత్సాహం అందించనుంది.

అట్టడుగు వర్గాల వారు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలి. ప్రపంచాన్ని మారుస్తున్న టెక్నాలజీ గురించి విద్యార్థులు తెలుసుకోలి. ప్రపంచాన్ని శాసించబోయే ఏఐ, ఇతర లాంగ్వేజీలపై విద్యార్థులు దృష్టి పెట్టాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు అడుగులు వేయాలి. నాయకత్వ లక్షణాలు పెంపొందే విధంగా విధ్యనభ్యసించాలి. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్య నభ్యసించి రాష్ట్రస్థాయిలో టాప్ ర్యాంకులు సాధించిన వారితో మిగతావరు స్ఫూర్తి పొందాలన్న సీఎం జగన్.

పేదరికం వల్ల ఎవరూ చదువులకు దూరం కాకూడదనేది ప్రభుత్వం నిర్ణయం. మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లు తీసుకొచ్చాం. డిజిటల్ బోధనతో ఎఫెక్టివ్ గా చదువు నేర్పిస్తున్నాం. ఈ ఏడాది నుంచి మూడో తరగతి నుంచి టోఫెల్ కు ప్రిపేర్ చేస్తున్నాం. ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలతో పోటీ పడే పరిస్థితి కి తీసుకొచ్చాం. తల్లిదండ్రులు అప్పులు పాలు కాకుండా డిగ్రీ వరకూ విద్య అందిస్తున్నాం. డిగ్రీ,మెడిసిన్ ఫీజులు ప్రభుత్వమే భరిస్తూ విద్యా దీవెన,వసతి దీవెన తీసుకొచ్చాం. విదేశాల్లో కూడా టాప్ యూనివర్సిటీల్లో ఫీజులు భరిస్తున్నమని సీఎం జగన్ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం