రోగుల‌కు మంచి ఆహారం, ఆస్పత్రుల్లో పారిశుధ్యం పెంచండి… అధికారుల‌కు సీఎం ఆదేశాలు .. ఆనందయ్య మందుపై కీల‌క నిర్ణ‌యం.

కోవిడ్ నియంత్రణ, నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్షించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ కెపాసిటీకి తగ్గట్టుగా ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్లు ఏర్పాటయ్యేలా...

రోగుల‌కు మంచి ఆహారం, ఆస్పత్రుల్లో పారిశుధ్యం పెంచండి... అధికారుల‌కు సీఎం  ఆదేశాలు .. ఆనందయ్య మందుపై కీల‌క నిర్ణ‌యం.
cm-jagan-
Follow us
Ram Naramaneni

|

Updated on: May 21, 2021 | 2:47 PM

కోవిడ్ నియంత్రణ, నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్షించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ కెపాసిటీకి తగ్గట్టుగా ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్లు ఏర్పాటయ్యేలా చూడాలని ఆదేశించారు. బ్లాక్ ఫంగస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఆస్పత్రుల్లో నిర్ణీత ప్రమాణాలు పాటించాలన్నారు. రోగులకు మంచి ఆహారం, ఆస్పత్రుల్లో పారిశుధ్యంపై ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అధిక ఫీజుల వసూళ్లు, రెమిడెసివర్ ఇంజక్షన్ల పేరుతో అక్రమాలపై కచ్చితమైన చర్యలు ఉండాలన్నారు. నెల్లూరు ఆయుర్వేద మందు పై సంబంధిత విభాగాలతో శాస్త్రీయ నిర్ధారణ చేయించాలన్నారు.

నెల్లూరు జిల్లా ఆయుర్వేద మందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో సీఎం జగన్‌ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆ మందు పంపిణీ చేయాలా? వద్దా? అనే అంశంపై అధికారులు, నిపుణుల నుంచి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయుర్వేద మందు శాస్త్రీయత, పనిచేసే విధానంపై అధ్యయనం చేయించాలని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. కొవిడ్‌పై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సీఎం జగన్‌ ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల అధికారులతో టెస్టులు చేయించాలని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి ఐసీఎంఆర్‌ బృందాన్ని పంపాలని.. ఆయుర్వేద వైద్యంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని సీఎం అధికారుల‌కు సూచించారు.

ఈరోజు సాయంత్రం ఐసీఎంఆర్ బృందం నెల్లూరుకి చేరుకోనుంది. ఈ క్ర‌మంలో ఇతర రాష్ట్రాల నుంచి కరోనా మందు కోసం ఎవరూ రావద్దని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కోరారు.  వేలాది రావడం వల్ల పోలీసులు కూడా నియంత్రించలేని పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు. ఈరోజు సాయంత్రం నాటికి ఆయుష్ అనుమతులు కూడా వస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ప్రభుత్వ అనుమతులు, క్లీన్ చిట్ వస్తే రాష్ట్రాల వారికి కొరియర్ చార్జీలు కూడా తామే భరించి మందులు పంపిణీ చేస్తామ‌ని వెల్ల‌డించారు.

Also Read: వరంగల్‌ ఎంజీఎంను సందర్శించిన సీఎం కేసీఆర్‌.. కరోనా వార్డులో రోగులకు ధైర్యం చెప్పిన సీఎం

‘రెండు నిమిషాలాగితే చనిపోయే వాడినే.. ఈ లోగా మావాళ్లు కృష్ణపట్నం కరోనా మందు వేయడంతో బ్రతికున్నా’