CM Jagan: రేపల్లె ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్.. మూడు నియోజకవర్గాల్లో పర్యటన..

ఒకరోజు విరామం తరువాత ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు సీఎం జగన్. మే 6న మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. సీఎం జగన్ పూర్తి షెడ్యూల్ ను వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ సిద్దం, మేమంతా సిద్దం అంటూ బస్సుయాత్రలు చేపట్టారు. ఆ తరువాత ప్రతి రోజు మూడు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

CM Jagan: రేపల్లె ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్.. మూడు నియోజకవర్గాల్లో పర్యటన..
Cm Jagan

Updated on: May 06, 2024 | 11:31 AM

ఒకరోజు విరామం తరువాత ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు సీఎం జగన్. మే 6న మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. సీఎం జగన్ పూర్తి షెడ్యూల్ ను వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ సిద్దం, మేమంతా సిద్దం అంటూ బస్సుయాత్రలు చేపట్టారు. ఆ తరువాత ప్రతి రోజు మూడు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం 10 గంటలకు బాపట్ల లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని రేపల్లెలో రోడ్ షో పాల్గొంటారు. రేపల్లెలో ఉన్న అంబేద్కర్ సెంటర్ ఈ రోడ్ షోకు వేదికైంది. ప్రచార  కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు స్థానిక వైసీపీ నాయకులు. బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ కు మద్దతు ఇవ్వవల్సిందిగా సీఎం జగన్ ప్రసంగించనున్నారు.

రేపల్లె ప్రచారం అనంతరం నేరుగా ప్రత్యేక హెలీకాఫ్టర్లో మాచర్ల చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.30 నిమిషాలకు నరసరావు పేట నియోజకవర్గం పరిధిలోని మాచర్లలోని శ్రీనివాస్ మహల్ సెంటర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నంలోని వల్లూరి రాజా సెంటర్‎లో ఏర్పాటు చేసిన ప్రచారసభలో పాల్గొంటారు. ఈరోజు నిర్వహించే ప్రచారంలో చాలా ప్రత్యకత ఉంది. ఏపీలో నేడు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. రాజమండ్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అదే క్రమంలో అనకాపల్లి నియోజకవర్గంలో కూడా సీఎం రమేష్ కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఒకవైపు సీఎం జగన్, మరోవైపు మోదీ పర్యటనలతో ఏపీ మొత్తం ప్రచార హోరుజోరందుకుందంటున్నారు స్థానికులు. ఇప్పటి వరకు సీఎం జగన్ ఏర్పాటు చేసిన రోడ్ షోలకు, బహిరంగ సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. సీఎ జగన్ ను చూసేందుకు, ఆయనతో ఫోటో దిగేందుకు అభిమానులు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..