AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు.. కుటుంబ సమేతంగా ప్రత్యేక దర్శనం

CM Chandrababu Tirumala: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో 16వసారి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఏపీ ప్రభుత్వం తరఫున తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం అనంతరం సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని..

Tirumala: తిరుమల శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు.. కుటుంబ సమేతంగా ప్రత్యేక దర్శనం
Cm Chandrababu Tirumala
Subhash Goud
|

Updated on: Sep 15, 2026 | 9:31 PM

Share

CM Chandrababu Tirumala: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంగళవారం ఏపీ ప్రభుత్వం తరఫున ఆయన శ్రీవారికి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు ముందుగా శ్రీవారి ఆలయానికి వెళ్లారు. అనంతరం ఆనంద నిలయంలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వర స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వెంట మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి తదితరులు ఉన్నారు. ఆలయ అధికారులు, అర్చకులు సీఎంకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

సీఎం హోదాలో 16వ సారి..

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో 16వసారి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఏపీ ప్రభుత్వం తరఫున తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం అనంతరం సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు సమాచారం. తిరుమలలో సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us