Road Accident: చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేటలో వద్ద కంటైనర్ లారీని ఒక కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమదాన్ని గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించారు. గాయపడిన వారిలో ప్రస్తుతం ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం అతి వేగం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడమేనని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా.. వాహనదారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు.. అతి వేగంతో వాహనాలు నడిపి ప్రమాదాల భారీన పడుతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది. వేగంగా వెళ్తున్న ఓ కారు కంటైనర్ లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళ్తే.. గురువారం సాయంత్రం పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఒక కంటైనర్ వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానిక వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. వాళ్లు హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడిన ఇద్దరిని హాస్పిటల్‌కు తరలించి.. కారులో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశారు. అనంతం పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అయితే ప్రమాద సమయంలో కారులో మొత్తం ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వివరాలు మాత్రం ఇప్పటికీ తెలియలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
