చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరుకానున్న సినీరాజకీయ ప్రముఖులు వీరే..

| Edited By: Ravi Kiran

Jun 12, 2024 | 11:34 AM

చంద్రబాబు కోసం అతిరథ మహారథులంతా ఏపీకి తరలివస్తున్నారు. తెలుగు స్టేట్స్‌ నుంచే కాదు దేశ నలుమూలల నుంచి వీవీఐపీలు కేసరపల్లికి క్యూకట్టారు. ఇప్పటికే అమిత్‌షా, నడ్డా చేరుకోగా.. ఇవాళ గన్నవరంలో ల్యాండ్‌ కాబోతున్నారు ప్రధాని మోదీ. ఇక, సినీరంగం నుంచి సూపర్‌స్టార్స్‌ అంతా తరలివస్తున్నారు. దీంతో అందరి చూపు బెజవాడ వైపే మళ్లింది. గన్నవరం టు కేసరపల్లి వయా విజయవాడ అంటున్నారు ప్రముఖులు. దేశ ప్రధాని నరేంద్రమోదీ మొదలు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్‌ అండ్‌ సెంట్రల్‌ మినిస్టర్‌ జేపీ నడ్డా వరకూ చాలా మంది హాజరుకానున్నారు.

చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరుకానున్న సినీరాజకీయ ప్రముఖులు వీరే..
Chandrababu Naidu
Follow us on

చంద్రబాబు కోసం అతిరథ మహారథులంతా ఏపీకి తరలివస్తున్నారు. తెలుగు స్టేట్స్‌ నుంచే కాదు దేశ నలుమూలల నుంచి వీవీఐపీలు కేసరపల్లికి క్యూకట్టారు. ఇప్పటికే అమిత్‌షా, నడ్డా చేరుకోగా.. ఇవాళ గన్నవరంలో ల్యాండ్‌ కాబోతున్నారు ప్రధాని మోదీ. ఇక, సినీరంగం నుంచి సూపర్‌స్టార్స్‌ అంతా తరలివస్తున్నారు. దీంతో అందరి చూపు బెజవాడ వైపే మళ్లింది. గన్నవరం టు కేసరపల్లి వయా విజయవాడ అంటున్నారు ప్రముఖులు. దేశ ప్రధాని నరేంద్రమోదీ మొదలు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్‌ అండ్‌ సెంట్రల్‌ మినిస్టర్‌ జేపీ నడ్డా వరకూ.. అటు సినిమా రంగం నుంచి మెగాస్టార్‌ చిరంజీవి మొదలు తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ వరకూ.. పొరుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ఎంపికైన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఇలా చెప్పుకుంటూపోతే పెద్ద లిస్టే ఉంది. ఒకరా ఇద్దరు వందలమంది వీవీఐపీలు, అతిరథ మహారథులు.. చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవంలో పాల్గోనబోతున్నారు. వీరితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ ఎన్వీ రమణ, ఇతర రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్న చిరాగ్ పాశ్వాన్, నితిన్ గడ్కరీ, జితిన్ మాంఝి, జయంత్ చౌదరి, అనుప్రియ పటేల్, రాందాస్ అథవాలే, ప్రఫుల్ పటేల్ ముఖ్యఅతిథులుగా హాజరవనున్నారు. అలాగే మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, మాజీ గవర్నర్ తమిళిసై కూడా కేసరపల్లికి రానున్నారు.

కేంద్ర మంత్రులు అమిత్‌షా, జేపీ నడ్డా, చిరంజీవి ఫ్యామిలీ, రజినీకాంత్‌, నారా, నందమూరి కుటుంబాలు ఇప్పటికే బెజవాడలో ల్యాండ్‌ అయ్యారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌ అందుకున్న అమిత్‌షా, నడ్డాలు.. ఆ తర్వాత చంద్రబాబు ఇచ్చిన ప్రత్యేక విందులో పాల్గొన్నారు. ఇక, ప్రధాని నరేంద్రమోదీ, ఇవాళ ఉదయం పదిన్నర తర్వాత గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌కానున్నారు. అక్కడి నుంచి నేరుగా కేసరపల్లిలోని ప్రమాణస్వీకార వేదిక దగ్గరకు చేరుకుంటారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు వేదికపై ఉండనున్న మోదీ.. ఆ తర్వాత గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఒడిశాకు బయల్దేరి వెళ్తారు.

చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవానికి ప్రత్యేక అతిథులు, వీవీఐపీలతోపాటు టీడీపీ కేడర్‌ కూడా పెద్దఎత్తున తరలివస్తోంది. దీంతో, విజయవాడ, గన్నవరం, కేసరపల్లి.. ఈ మూడు ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. తెలుగుదేశం నేతలు, కార్యకర్తల రద్దీతో ఎయిర్‌పోర్ట్‌, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో విపరీతమైన హడావిడి కనిపిస్తోంది. మరోవైపు, బెజవాడ-గన్నవరం-కేసరపల్లి.. హైఅలర్ట్‌ జోన్‌గా మారింది. వీవీఐపీల రాకతో ఈ ప్రాంతమంతా ఖాకీల పహారాలోకి వెళ్లిపోయింది. హైసెక్యూరిటీతోపాటు చీమ చిటుక్కుమన్నా తెలిసేలా సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..