AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Budget 2024: మరోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. చంద్రబాబు సర్కార్ ఆర్డినెన్స్.. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా..

చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.. దీంతో రాష్ట్ర చరిత్రలో ఒకే ఏడాదిలో రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కానుంది.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చేందుకు సమయం పడుతుందని భావిస్తున్న ప్రభుత్వం.. మరికొంత కాలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను కొనసాగించాలని నిర్ణయించింది..

AP Budget 2024: మరోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. చంద్రబాబు సర్కార్ ఆర్డినెన్స్.. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా..
Chandrababu - Pawan Kalyan
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Jul 31, 2024 | 9:02 AM

Share

చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.. దీంతో రాష్ట్ర చరిత్రలో ఒకే ఏడాదిలో రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కానుంది.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చేందుకు సమయం పడుతుందని భావిస్తున్న ప్రభుత్వం.. మరికొంత కాలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను కొనసాగించాలని నిర్ణయించింది.. ఈ మేరకు ఆన్లైన్ లో కేబినెట్ మంత్రుల నుంచి ఆమోదం లభించింది.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు ను గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపనుంది.. గవర్నర్ ఆమోదం తర్వాత ఆర్డినెన్సు ను జారీ చేయనుంది.

కాగా.. గత ప్రభుత్వం పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు రేపటితో కాలపరిమితి ముగియనుంది.. నాలుగు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు కు ఆమోదం తీసుకున్న తర్వాత దానిని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.. సుమారు 1.30 లక్షల కోట్ల రూపాయల మేర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు ను రూపొందిచింది.. 40 విభాగాలకు చెందిన డిమాండ్ లు, గ్రాంట్ లకు ఆమోదం వచ్చేలా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సుకు మంత్రిమండలి ఆమోదించింది.. కాగా.. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర లో ఆరునెలలు రెగ్యులర్ బడ్జెట్ లేని సంవత్సరం 2024 కానుంది.. కాగా.. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి ముగిసిన అనంతరం.. సెప్టెంబర్ లేదా ఆక్టోబర్‌ నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి పూర్తిస్థాయి బడ్జెట్ పై నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో అన్నా క్యాంటీన్ల ప్రారంభం, రోడ్ల మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పన సహా కొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్ కేటాయింపులు జరపనుంది.. కేంద్ర ప్రభుత్వ పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ లకు కొంత మొత్తం కేటాయించనుంది.. దీంతోపాటు పోలవరం ప్రాజెక్టుకు కూడా నిధులు సమకూర్చనున్నట్లు తెలుస్తోంది..

దేశ చరిత్రలో ఇదే తొలిసారి..!

సాధారణంగా ప్రతీ ఏటా రాష్ట్ర అవసరాలు, మౌళిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ పథకాల అమలుకు మార్చి నెలలోపు అసెంబ్లీ లో బడ్జెట్ సమావేశాలు పెట్టి ప్రతిపాదనలను ఆమోదిస్తారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభం అంటే ఏప్రిల్ 1 నుంచి కొత్త బడ్జెట్ అమలులోకి వస్తుంది. బడ్జెట్ ప్రతిపాదనలకు అసెంబ్లీ ఆమోదం లేకుండా ఒక్క పైసా కూడా ఖర్చు చేయడానికి వీలు కాదు. అయితే ఎన్నికల ఏడాది లో మాత్రం ఆయా ప్రభుత్వాలు ఎన్నికలకు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వాలకు ఆర్థిక వెసులు బాటు ఇచ్చేందుకు రెగ్యులర్ బడ్జెట్ బదులు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను పెడతారు. దాని కాలపరిమితి గరిష్టంగా నాలుగు నెలలు. కానీ కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వాలు వెంటనే బడ్జెట్ సమావేశాలు పెట్టుకుని ఆమోదించుకుని ముందుకు వెళ్తుంటాయి. కానీ రాష్ట్రంలో దేశంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం, ఇంకా ఆదాయం, అప్పులపై కొత్త ప్రభుత్వానికి స్పష్టత రాకపోవడం తో మరో నాలుగు నెలల సమయానికి ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నే కొనసాగించాలని నిర్ణయించింది. ఆన్లైన్ లో కేబినెట్ ఆమోదం తీసుకుని ప్రతిపాదనలను గవర్నర్ కు పంపింది. గవర్నర్ ఆమోదం తర్వాత ఆర్డినెన్సు ను జారీ చేయనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..!
బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..!