AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తుఫాను ఎఫెక్ట్‌తో ఏపీకి భారీ వర్ష సూచన.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అర్నబ్ తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాను ముప్పును ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అత్యున్నత స్థాయి సన్నద్ధతతో ఉండాలని, ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు.

తుఫాను ఎఫెక్ట్‌తో ఏపీకి భారీ వర్ష సూచన.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు!
Cm Chandrababu Review
Balaraju Goud
|

Updated on: Oct 25, 2026 | 8:41 PM

Share

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అర్నబ్ తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాను ముప్పును ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అత్యున్నత స్థాయి సన్నద్ధతతో ఉండాలని, ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటంతో పాటు ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

పది శాఖల అధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన ఈ సమీక్షలో తుఫాను అంచనాలు, భారీ వర్షాలు, గాలుల తీవ్రత, సహాయక చర్యలపై చర్చించారు. శాటిలైట్ సమాచారం, శాస్త్రీయ డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి నాలుగు గంటలకు తుఫానుకు సంబంధించిన తాజా బులెటిన్ విడుదల చేయాలని ఆదేశించారు. ప్రజల మొబైల్ ఫోన్లకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపిస్తూ అప్రమత్తం చేయాలని, తీరప్రాంత గ్రామాల్లో ప్రజలకు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు.

అక్టోబర్ 28న తీరం దాటే అవకాశం!

అధికారుల అంచనాల ప్రకారం, అక్టోబర్ 28వ తేదీ మధ్యాహ్నంలోగా బాపట్ల-విశాఖపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. కోనసీమ, యానాం, కాకినాడ పరిసర ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అక్టోబర్ 26 ఉదయానికి తుఫానుగా, అదే రోజు రాత్రికి తీవ్ర తుఫానుగా, 27వ తేదీ నాటికి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు వివరించారు. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, కొన్ని సందర్భాల్లో గాలి వేగం గంటకు 140 కిలోమీటర్లకు చేరవచ్చని అంచనా వేశారు.

ఉత్తరాంధ్ర, కోస్తాకు భారీ వర్ష సూచన!

అక్టోబర్ 27, 28 తేదీల్లో ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రభావిత జిల్లాల్లో సగటున 22 నుంచి 29 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని వివరించారు.

గర్భిణీల తరలింపు.. సహాయక కేంద్రాలు సిద్ధం!

తుఫాను ప్రభావంతో రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున, ఈ వారంలో ప్రసవం జరగనున్న గర్భిణీలను ముందుగానే ఆసుపత్రులకు తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన బోట్లు తీరానికి చేరేలా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ సరఫరా దెబ్బతింటే వెంటనే పునరుద్ధరించేలా సిబ్బందిని సిద్ధం చేయాలని సూచించారు. అలాగే తాగునీరు, ఆహార నిల్వలు సిద్ధం చేయడంతో పాటు పునరావాస కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించాలని, నిధుల కొరత లేకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మొబైల్ నెట్‌వర్క్ దెబ్బతిన్నా త్వరగా పునరుద్ధరించేలా సంబంధిత సంస్థలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. జీరో ఇన్సిడెంట్స్ లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు.

కాగా, తుఫాను మార్గం, తీవ్రత, తీరం దాటే సమయం వాతావరణ పరిస్థితులను బట్టి మారవచ్చు. ప్రజలు అధికారిక వాతావరణ హెచ్చరికలు, జిల్లా యంత్రాంగం సూచనలను అనుసరించాలి.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అర్నబ్ తుఫానుపై సీఎం చంద్రబాబు అలర్ట్.. కీలక ఆదేశాలు..!
అర్నబ్ తుఫానుపై సీఎం చంద్రబాబు అలర్ట్.. కీలక ఆదేశాలు..!
శత్రువైనా తోక ముడవాల్సిందే.. ఈ రాశులకు శుక్రుడి బ్లెస్సింగ్స్
శత్రువైనా తోక ముడవాల్సిందే.. ఈ రాశులకు శుక్రుడి బ్లెస్సింగ్స్
ఈకలనే వాటర్ బాటిల్‌గా మార్చి.. పిల్లల దాహం తీర్చేందుకు 70కి.మీ.
ఈకలనే వాటర్ బాటిల్‌గా మార్చి.. పిల్లల దాహం తీర్చేందుకు 70కి.మీ.
  దంపతుల మధ్య ప్రేమ పెరగాలంటే.. బెడ్‌రూమ్‌లో ఈ మార్పులు చేయండి!
  దంపతుల మధ్య ప్రేమ పెరగాలంటే.. బెడ్‌రూమ్‌లో ఈ మార్పులు చేయండి!
 శరద్ పూర్ణిమ వేళ ఈ రాశులవారి జీవితాల్లో హఠాత్తుగా శుభయోగం!
 శరద్ పూర్ణిమ వేళ ఈ రాశులవారి జీవితాల్లో హఠాత్తుగా శుభయోగం!
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. RRB JE CBT 1 హాల్ టికెట్లు విడుదల!
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. RRB JE CBT 1 హాల్ టికెట్లు విడుదల!
గుడ్ న్యూస్‌.. హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలకు చెక్‌!
గుడ్ న్యూస్‌.. హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలకు చెక్‌!
ఎల్లిపాయ కారం ఇలా చేసి.. వేడి అన్నంలో నెయ్యితో తింటే ఆ రుచే వేరు!
ఎల్లిపాయ కారం ఇలా చేసి.. వేడి అన్నంలో నెయ్యితో తింటే ఆ రుచే వేరు!
రుచిలో మటన్‌తో పోటీపడే మిల్‌మేకర్ కర్రీ! 
రుచిలో మటన్‌తో పోటీపడే మిల్‌మేకర్ కర్రీ! 
ఖాతాదారులకు అలర్ట్‌.. నవంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు..!
ఖాతాదారులకు అలర్ట్‌.. నవంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు..!