Today Horoscope: ఈ 5 రాశుల వారికి ధనలాభం, ఉద్యోగంలో శుభవార్తలు! సోమవారం దినఫలాలు ఇదిగో..
Horoscope Today: అక్టోబర్ 26, 2026 సోమవారం దిన ఫలాలు ఇవే. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం, ప్రయాణాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకోండి. మీ రాశి ఫలాన్ని చదివి రోజును ప్రారంభించండి.

దిన ఫలాలు (అక్టోబర్ 26, 2026): మేషం రాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా పురోగమిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. వృషభం రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో హోదా, స్థాయి పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. మిథునం రాశివారికి ఉద్యోగంలో ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగ విధులను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. సోమవారం మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1):
ఉద్యోగ జీవితం ఉత్సాహంగా పురోగమిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మిత్రులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు, బకాయిలు చేతికి అందుతాయి. ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. ఇంటా బయటా శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎవరి వివాదంలోనూ తలదూర్చవద్దు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2):
వృత్తి, ఉద్యోగాల్లో హోదా, స్థాయి పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. అవసర సమయాల్లో మిత్రులు అండగా నిలబడతారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారితో పరిచ యాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. విలువైన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రయత్నాలు శుభ ఫలితాలనివ్వడం ప్రారంభి స్తాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3):
ఉద్యోగంలో ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగ విధులను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. కుటుంబ బాధ్యతలు ఇబ్బంది కలిగిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. దూర ప్రాంతం నుంచి శుభ వార్త అందుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష):
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. శరీరానికి విశ్రాంతి ఉండకపోవచ్చు. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కొద్దిపాటి శ్రమతో అధిక లాభం పొందుతారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ పెద్దల సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1):
ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. ముఖ్యమైన వ్యవహారాల కారణంగా నిమిషం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాల్లో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2):
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా మారతాయి. వృత్తి, వ్యాపా రాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో దైవ కార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందుతుంది. సర్వత్రా మీ మాట చెల్లుబాటవుతుంది. పిల్లల భవిష్యత్తు మీద దృష్టి కేంద్రీకరిస్తారు. పట్టుదలగా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.
తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3):
ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. తండ్రి జోక్యంతో స్థిరాస్తి వివాదం కొలిక్కి వస్తుంది. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయవద్దు. కొందరు మిత్రులు తప్పుదోవ పట్టించే సూచనలున్నాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట):
వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు, వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తి అవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి సహాయంతో ముఖ్యమైన సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1):
ఉద్యోగ జీవితం చాలావరకు సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరిగి క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరం. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడం మంచిది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆశించిన శుభవార్తలు వింటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2):
ఉద్యోగంలో పని భారం, పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. స్వల్ప అనారోగ్యంతో ఇబ్బందిపడే అవకాశం ఉంది. ఉచిత సహాయాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని సమస్యలు అనుకోకుండా పరిష్కారమవుతాయి. ఆదాయానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ఆస్తి వివాదం పరిష్కారం లభించవచ్చు. ధన యోగం కలుగుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3):
రోజంతా ప్రశాంతంగా, సంతృప్తికరంగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగరీత్యా ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయట పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవాభిమానాలు పెరుగుతాయి. మాటకు, చేతకు విలువ ఉంటుంది. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు ఆశించిన ప్రయోజనం పొందుతారు. మిత్రుల వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి):
ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో వ్యూహాలు మార్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ సంబంధమైన కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల నుంచి సహకారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యంలో పాల్గొంటారు. ఆర్థికంగా అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగాఅనుకూలంగా ఉంటుంది.