AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన చంద్రబాబు, పవన్.. ఏమని ఫిర్యాదు చేశారంటే..

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఓట్ల జాబితాలోని సమస్యలు, పోలింగ్ నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించేందుకు విజయవాడ చేరుకుంది. ఈరోజు ముఖ్య పార్టీల నేతలతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి వెళ్లారు.

Pawan Kalyan: కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన చంద్రబాబు, పవన్.. ఏమని ఫిర్యాదు చేశారంటే..
Pawan Kalyan And Chandra Babu
Srikar T
|

Updated on: Jan 09, 2024 | 12:27 PM

Share

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఓట్ల జాబితాలోని సమస్యలు, పోలింగ్ నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించేందుకు విజయవాడ చేరుకుంది. ఈరోజు ముఖ్య పార్టీల నేతలతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి వెళ్లారు. ముందుగా చంద్రబాబు నవోటల్ లో బస చేస్తున్న పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళి అక్కడి నుంచి ఈసీ ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు చంద్రబాబు.

ఎన్నికల అధికారులను కలిసి రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఏపీలో ఎన్నికలపై ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణలో సజావుగా ఎన్నికలు సాగాయి. ఇక్కడ కూడా అలాగే నిర్వహించేలా చూడాలన్నారు. ఆరు వేల నుంచి ఏడు వేల ఓట్లు తొలగించినట్లు ఫిర్యాదు చేశామన్నారు. దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశ్నిస్తే బైండోవర్ కేసులతో ప్రతి పక్షాలను వేదిస్తున్నారని తెలిపారు. సచివాలయ సిబ్బందిని ఎన్నికల డ్యూటీకి దూరంగా ఉంచాలని కోరామన్నారు. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తమ కార్యకర్తలను పనిచేసుకోనివ్వడం లేదని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి ఓటువేసే అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిపారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీలో ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై ఫిర్యాదు చేశామన్నారు. ఏపీలో అధికార దుర్వినియోగం జరుగుతోందన్నారు పవన్ కళ్యాణ్. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూస్తామని ఎన్నికల సంఘం హామీ ఇచ్చినట్లు తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ రాజ్యంగ వ్యతిరేకం అన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు చర్యలు చేపట్లాలన్నారు. ఏపీలో దొంగ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు.

ఇవి కూడా చదవండి

మరన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..