Andhra Pradesh: మొదలైన సంక్రాంతి సందడి.. దర్శిలో ఎడ్ల బలప్రదర్శన పోటీలు.. ఆకట్టుకున్న మహిళా రైతు ప్రదర్శన..
గుంటూరుజిల్లా పెదకాకాని మండలం తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన నందిపాటి భావగ్నకు చిన్న తనం నుంచి ఎద్దులన్నా, ఎడ్ల పందేలాన్నా ఎక్కడ లేని ఆశక్తి కనబరిచేది. ఈ క్రమంలో ఎక్కడ ఎడ్ల పందేలు జరిగినా తన గిత్తలను తీసుకుని హాజరవుతోంది. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులతో పాటు తాను కూడా దర్శిలో జరుగుతున్న జాతీయస్తాయి ఎడ్ల పందేల్లో పాల్గొన్నది. రెండో రోజు జరిగిన పోటీల్లో 4 పళ్ళ ఎద్దుల పోటీల్లో పోటీ పడింది.
ప్రకాశంజిల్లా దర్శిలో సంక్రాంతి పండుగ సందర్బంగా ఏర్పాటు చేసిన ఎడ్ల పందేల్లో మహిళా రైతు ప్రదర్శన ఆకట్టుకుంది. ఎడ్లను బరిలో పరుగులు పెట్టిస్తూ రంకెలేయించిన వైనం పోటీల్లో హైలెట్‌గా నిలిచింది. దర్శిలో గతంలో ఎన్నడూలేని విధంగా నాలుగు రోజులు పాటు భారీ స్థాయిలో జాతీయ స్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు ఏర్పాటు చేయడంతో ఈ పోటీలను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…
బరిలో ఆకట్టుకున్న మహిళా రైతు ప్రదర్శన…
గుంటూరుజిల్లా పెదకాకాని మండలం తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన నందిపాటి భావగ్నకు చిన్న తనం నుంచి ఎద్దులన్నా, ఎడ్ల పందేలాన్నా ఎక్కడ లేని ఆశక్తి కనబరిచేది. ఈ క్రమంలో ఎక్కడ ఎడ్ల పందేలు జరిగినా తన గిత్తలను తీసుకుని హాజరవుతోంది. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులతో పాటు తాను కూడా దర్శిలో జరుగుతున్న జాతీయస్తాయి ఎడ్ల పందేల్లో పాల్గొన్నది. రెండో రోజు జరిగిన పోటీల్లో 4 పళ్ళ ఎద్దుల పోటీల్లో పోటీ పడింది. తన శక్తిని అంతా చేతుల్లోకి తెచ్చుకుని బండలాగుడు పోటీల్లో పాల్గొని ఎడ్లను పరుగులు పెట్టించింది. అయితే ఈ పోటీల్లో 9వ బహుమతితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది…
4 రోజులు ఉత్సాహంగా… ఉల్లాసంగా.
దర్శిలో నాలుగు రోజులు పాటు భారీ స్థాయిలో జాతీయ స్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు ఏర్పాటు చేయడంతో ఈ పోటీలను తిలకించేందుకు ప్రజలు పోటెత్తారు. వందలాది మంది మహిళలు కూడా వేదిక వద్ద కూర్చుని పోటీలు తిలకించడం విశేషం. తొలిరోజు నాలుగు పళ్ల ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించగా అత్యధికంగా 38 జతలు పాల్గొన్నాయి… రెండవ రోజు ఆరుపళ్ల ఎడ్ల బలప్రదర్శన పోటీలకు 21 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. మూడవ రోజు న్యూ క్యాటగిరీ ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించారు… ఇక చివరిగా రేపు అంటే 9వ తేదీ సీనియర్ క్యాటగిరీ ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహిస్తారు… ఈ పోటీల్లో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబర్చిన ఎడ్లజత యజమానికి ట్రాక్టర్ బహుమతిగా గెలుపొందే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..