Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: అయోధ్యలో బాల రాముడు కొలువుదీరే వేళ.. యుపీ ముస్లిమ్స్ సంచలన నిర్ణయం..

కోట్లాది మంది హిందువుల కల తీరే సమయం ఆసన్న మతున్న వేళ.. ఉత్తర్ ప్రదేశ్ లోని ముస్లింలు సంచలన నిర్ణయం తీసుకుంది. అయోధ్యలోని రామమందిరంలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించే రోజైన జనవరి 22న రాష్ట్ర రాజధాని లక్నోలోని పలు ప్రాంతాల్లో మాంసం దుకాణాలను మూసివేయనున్నట్లు రాష్ట్రంలోని ప్రముఖ ముస్లిం సంస్థ ప్రకటించింది. రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించే శుభ సమయంలో లక్నోలోని పలు ప్రాంతాల్లో మాంసం దుకాణాలను మూసివేయాలని ఆల్ ఇండియా జమియాతుల్ ఖురేష్ నిర్ణయించింది.

Ayodhya: అయోధ్యలో బాల రాముడు కొలువుదీరే వేళ.. యుపీ ముస్లిమ్స్ సంచలన నిర్ణయం..
Ayodhya Ram Mandir
Follow us
Surya Kala

|

Updated on: Jan 08, 2024 | 5:37 PM

రాములోరి ఉత్సవాలకు అయోధ్య నగరి మాత్రమే కాదు.. ఊరువాడా సిద్దమవుతుంది. ఎక్కడ చూసినా రామ నామ స్మరణే.. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతా రామ మయంగా మరిపోయింది. కోట్లాది మంది హిందువుల కల తీరే సమయం ఆసన్న మతున్న వేళ.. ఉత్తర్ ప్రదేశ్ లోని ముస్లింలు సంచలన నిర్ణయం తీసుకుంది. అయోధ్యలోని రామమందిరంలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించే రోజైన జనవరి 22న రాష్ట్ర రాజధాని లక్నోలోని పలు ప్రాంతాల్లో మాంసం దుకాణాలను మూసివేయనున్నట్లు రాష్ట్రంలోని ప్రముఖ ముస్లిం సంస్థ ప్రకటించింది. రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించే శుభ సమయంలో లక్నోలోని పలు ప్రాంతాల్లో మాంసం దుకాణాలను మూసివేయాలని ఆల్ ఇండియా జమియాతుల్ ఖురేష్ నిర్ణయించింది.

‘సద్భావనతో కూడిన నిర్ణయం’

ఆలిండియా జాతీయ కార్యదర్శి జమియాతుల్ ఖురేష్, షహబుద్దీన్ ఖురేషీ, దాని ఉపాధ్యక్షుడు అష్ఫాక్ ఖురేషీ సోమవారం ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్‌కు ఈ మేరకు మెమోరాండం సమర్పించారు. లక్నోలోని బిలోచ్‌పురా, సదర్ కాంట్, ఫతేగంజ్ , లాటౌచే రోడ్ ప్రాంతాల్లోని అన్ని మాంసం దుకాణాలను మూసివేయాలని పస్మండ ముస్లిం సంఘం నిర్ణయించినట్లు వారు తెలిపారు.

మనమంతా అయోధ్య నివాసులం. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠా రోజున సద్భావనను దృష్టిలో ఉంచుకుని, 22 జనవరి 2024న బిలోచ్‌పురా, సదర్ కాంట్, ఫతేగంజ్, లాటౌచె రోడ్ ప్రాంతాలలోని మాంసం వ్యాపారులందరూ తమ మాంస విక్రయాలను నిలిపివేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పవిత్రమైన రోజున తమ మాంస దుకాణాలను ముసి వేయనున్నామని పేర్కొంటూ.. రాష్ట్ర డిప్యూటీ సీఎంకు సమర్పించిన మెమోరాండంలో షహబుద్దీన్ ఖురేషీ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..