Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చేతికి దొరికిన లాకెట్‌ను మింగిన ఆరు నెలల చిన్నారి.. ఏమైందంటే..

నల్లగొండ జిల్లా నక్రేకల్ మండలం తాటికల్ గ్రామానికి చెందిన మొగిలి ఏమియమ్మ, భాస్కర్ దంపతులకు చార్విక అనే ఆరు నెలల పాప ఉంది. ఆ చిన్నారిని మంచంలో పడుకోబెట్టగా.. చేతికి దొరికిన లాకెట్ తో ఆడుకుంటుంది. తల్లి వంట గదిలోకి వెళ్ళి వచ్చేసరికి చార్విక గుక్క పెట్టి ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తుందని పరిశీలించిన తల్లికి.. చిన్నారి చేతిలో ఉండాల్సిన లాకెట్ కనిపించలేదు.

Telangana: చేతికి దొరికిన లాకెట్‌ను మింగిన ఆరు నెలల చిన్నారి.. ఏమైందంటే..
Telangana Girl
Follow us
M Revan Reddy

| Edited By: Surya Kala

Updated on: Jan 08, 2024 | 6:14 PM

సాధారణంగా చాలామంది చిన్నారులు చేతికి ఏది దొరికితే అది నోట్లో పెట్టు కుంటారు.. మింగుతుంటారు. అలా మింగిన వాటిని బయటకు తీసేందుకు సర్జరీలు కూడా చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అది ప్రాణాంతకంగా కూడా మారుతుంది. నల్గొండ జిల్లాలో ఆరు నెలల చిన్నారి లాకెట్ ను మింగింది… అయితే చిన్నారికి ఎటువంటి సర్జరీ చేయకుండానే చాక చక్యంగా లాకెట్ ను బయటకు తీశారు. వివరాల్లోకి వెళ్తే..

నల్లగొండ జిల్లా నక్రేకల్ మండలం తాటికల్ గ్రామానికి చెందిన మొగిలి ఏమియమ్మ, భాస్కర్ దంపతులకు చార్విక అనే ఆరు నెలల పాప ఉంది. ఆ చిన్నారిని మంచంలో పడుకోబెట్టగా.. చేతికి దొరికిన లాకెట్ తో ఆడుకుంటుంది. తల్లి వంట గదిలోకి వెళ్ళి వచ్చేసరికి చార్విక గుక్క పెట్టి ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తుందని పరిశీలించిన తల్లికి.. చిన్నారి చేతిలో ఉండాల్సిన లాకెట్ కనిపించలేదు. లాకెట్ ను చిన్నారి మింగి ఉంటుందని అనుమానంతో హుటహుటన నల్లగొండలోని ఆర్కే హాస్పిటల్ కు తీసుకువచ్చారు. తమ బిడ్డకు ఎలా ఉంటుందొనని తల్లిదండ్రులు ఆందోళన చెందారు.

గ్యాస్ట్రాలజిస్ట్ డాక్టర్ కీర్తి రెడ్డి.. చిన్నారికి స్కానింగ్ చేసి కడుపులో లాకెట్ ఉన్నట్లు గుర్తించారు. అయితే చిన్నారి కడుపులోని లాకెట్ ను బయటకు ఎలా తీయాలనే దానిమీద తర్జనభజన పడ్డారు. సర్జరీ ద్వారా కడుపులోని లాకెట్ ను బయటకు తీయాలని భావించారు. సర్జరీకి చిన్నారి హెల్త్ సపోర్ట్ చేస్తుందో లేదోననే అనుమానం డాక్టర్ కు కలిగింది. డాక్టర్ కీర్తి రెడ్డి ఎలాంటి సర్జరీ లేకుండా చాకచక్యంగా ఎండోస్కోప్ ద్వారా చిన్నారి కడుపులో నుండి లాకెట్ ను బయటికి తీశారు. సర్జరీ లేకుండా ఆరు నెలల చిన్నారి కడుపు నుండి లాకెట్ ను ఎండోస్కోపీ ద్వారా తీయడం అరుదైనదిగా డాక్టర్ కీర్తి రెడ్డి చెబుతున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉందని ఆమె చెబుతున్నారు. మొత్తానికి కడుపులో నుండి లాకెట్ ను బయటికి తీసి తమ బిడ్డను ప్రాణాపాయ నుంచి కాపాడారంటూ చిన్నారి తల్లిదండ్రులు డాక్టర్ కు ధన్యవాదాలు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మూడో ప్రపంచం ముంగిట ప్రపంచం..ఆందోళన కలిగిస్తున్న సలోమ్ జ్యోస్యం
మూడో ప్రపంచం ముంగిట ప్రపంచం..ఆందోళన కలిగిస్తున్న సలోమ్ జ్యోస్యం
IPL History: డెబ్యూ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన ఆటగాళ్లు వీరే..
IPL History: డెబ్యూ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన ఆటగాళ్లు వీరే..
మే 1 నుంచి మారనున్న ఈ నిబంధనలు తెలుసుకోవాల్సిందే
మే 1 నుంచి మారనున్న ఈ నిబంధనలు తెలుసుకోవాల్సిందే
వినియోగదారులకు అలర్ట్‌.. ఏప్రిల్ 1 నుంచి రానున్న మార్పులివే !
వినియోగదారులకు అలర్ట్‌.. ఏప్రిల్ 1 నుంచి రానున్న మార్పులివే !
ఫోన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోండి.. గూగుల్ హెచ్చరిక!
ఫోన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోండి.. గూగుల్ హెచ్చరిక!
పెంపుడు జంతువుల విషయంలో ఈ తప్పులు చేయకండి..?
పెంపుడు జంతువుల విషయంలో ఈ తప్పులు చేయకండి..?
మనసు దోచుకుంటున్న పిల్లిపిల్లకు కుక్క సాయం వీడియోపై ఓ లుక్ వేయండి
మనసు దోచుకుంటున్న పిల్లిపిల్లకు కుక్క సాయం వీడియోపై ఓ లుక్ వేయండి
ఈ అంకుల్ సైక్లింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ఈ అంకుల్ సైక్లింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ఇక్కడ తొలిసారిగా వందేభారత్‌.. 38 సొరంగాలు.. 927 వంతెనలు దాటుకుంటూ
ఇక్కడ తొలిసారిగా వందేభారత్‌.. 38 సొరంగాలు.. 927 వంతెనలు దాటుకుంటూ
అర్ధరాత్రి మిస్టరీ మహిళ.. డోర్‌బెల్స్‌ మోగిస్తుండటంతో జనంలో భయం
అర్ధరాత్రి మిస్టరీ మహిళ.. డోర్‌బెల్స్‌ మోగిస్తుండటంతో జనంలో భయం