Sankranti Special Trains: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో ఆ నగరాల మధ్య సంక్రాంతి ప్రత్యేక రైళ్లు
తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో సంక్రాంతి రద్దీ మొదలైపోయింది. వారం రోజులకు ముందే పలువురు తమ సొంత ఊళ్లకు బయలుదేరి వెళ్తున్నారు. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణీకులకు లబ్ధి చేకూరేలా ప్రత్యేక సంక్రాంతి రైళ్లను ప్రకటించింది. దీనికి కొనసాగింపుగా దక్షిణ మధ్య రైల్వే శాఖ సోమవారం (జనవరి 8న) మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

Sankranti Special Trains
తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో సంక్రాంతి రద్దీ మొదలైపోయింది. వారం రోజులకు ముందే పలువురు తమ సొంత ఊళ్లకు బయలుదేరి వెళ్తున్నారు. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణీకులకు లబ్ధి చేకూరేలా ప్రత్యేక సంక్రాంతి రైళ్లను ప్రకటించింది. దీనికి కొనసాగింపుగా దక్షిణ మధ్య రైల్వే శాఖ సోమవారం (జనవరి 8న) మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో పలు నగరాల మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ప్రత్యేక రైళ్ల వివరాలను తెలుసుకోండి..
- ప్రత్యేక రైలు నెం.07055 జనవరి 10న రాత్రి 10.25 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 09.10 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు రేణిగుంట, గూడరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్లలో ఆగనుంది.
- ప్రత్యేక రైలు నెం.07056 జనవరి 11న సాయంత్రం 07.00 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలేరి మరుసటి రోజు ఉదయం 06.45 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, అనకాపల్లి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగనుంది.
- ప్రత్యేక రైలు నెం.07057 జనవరి 12న రాత్రి 09.00 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.30 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది.
- మరో ప్రత్యేక రైలు నెం.07071 జనవరి 13న రాత్రి 09.00 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.30 గంటలకు కాకినాడ టౌన్‌కి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు జనగామ, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవారం టౌన్, తణుకు, నిడదవోలు,రాజమండ్రి, సమర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగనుంది.
- ప్రత్యేక రైలు నెం. 07072 జనవరి 14న ఉదయం 10.00 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 08.20 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగనుంది.
- ప్రత్యేక రైలు నెం.02707 జనవరి 15న ఉదయం 05.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి అదే రోజు సాయంత్రం 05.00 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, డోన్, కర్నూలు సిటీ, గద్వాల, వనపర్తి రోడ్, మహబూబ్ నగర్, జడ్చెర్ల, షాద్ నగర్, ఉందానగర్ రైల్వే స్టేషన్లలో ఆగనుంది.