Hyderabad: ప్రజావాణి విన్నపాల పరిష్కారానికి డేట్ ఫిక్స్.. వీధి కుక్కల బెడదకు చెక్ పడుతుందా?

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను వారంలోగా పరిష్కరించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు.  ప్రజావాణి సందర్భంగా సోమవారం మేయర్ ఎల్బీనగర్ జోన్ కార్యాలయంలో ప్రజల నుంచి విన్నపాలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తిరిగి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని, గ్రేటర్ లో ప్రజల సమస్యల పరిష్కారానికి సర్కిల్, జోనల్ స్థాయిలో..

Hyderabad: ప్రజావాణి విన్నపాల పరిష్కారానికి డేట్ ఫిక్స్.. వీధి కుక్కల బెడదకు చెక్ పడుతుందా?
Stray Dogs
Follow us

|

Updated on: Jan 08, 2024 | 5:06 PM

హైదరాబాద్, జనవరి 8: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను వారంలోగా పరిష్కరించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు.  ప్రజావాణి సందర్భంగా సోమవారం మేయర్ ఎల్బీనగర్ జోన్ కార్యాలయంలో ప్రజల నుంచి విన్నపాలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తిరిగి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని, గ్రేటర్ లో ప్రజల సమస్యల పరిష్కారానికి సర్కిల్, జోనల్ స్థాయిలో నేటి నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. అదే విధంగా జనవరి 22న ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని మేయర్ తెలిపారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై వచ్చిన విన్నపాలురాగా అందులో అధిక మొత్తం టౌన్ ప్లానింగ్  విభాగం సంబంధించిన సమస్యలపై వచ్చాయన్నారు. స్వీకరించిన విన్నపాలను ప్రజావాణి కార్యక్రమం ముగిసిన అనంతరం తక్షణమే డి.సిలు టౌన్ ప్లానింగ్ శానిటేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మేయర్  స్వీకరించిన  విన్నపాలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టౌన్ ప్లానింగ్‌లో అక్రమ నిర్మాణాలు ఉంటే నిర్దేశించిన ప్రకారంగా చర్యలు తీసుకోవాలన్నారు. శానిటేషన్‌పై అందిన ఫిర్యాదులను తక్షణమే చర్యలు తీసుకోవాలని డి.సిలను ఆదేశించారు. దోమల నివారణకు స్లమ్ ఏరియాలో ప్రత్యేక దృష్టి సారించాలని మేయర్ ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణకు గురైన తక్షణమే స్పందించి తగు చర్యలు చేపట్టాలని మేయర్ అధికారులకు ఆదేశించారు.

నగరంలో కుక్కకాటు సమస్యలు ఎక్కువ అవుతున్న ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులపై సీరియస్ అయ్యారు. దీనిపై మేయర్‌ అధికారులను ప్రశ్నించగా.. కుక్కలపై వేసినటువంటి హై లెవెల్ కమిటీ అనేది ఎక్సిస్టెన్స్ లేదు అని, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కమిటీని తీసివేయడం జరిగిందని అందుకే వాట్సాప్ గ్రూప్ కూడా డిలీట్ చేశామని అధికారులు చెప్పారు. కుక్కల బెడద, కుక్క కాటు నివారణకు చర్యలు తీసుకోవాలని, కుక్కల స్టెరిలైజేషన్ సక్రమంగా జరుగుతున్నదో లేదో పరిశీలన చేయాలని వెటర్నిటీ అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై ప్రతి నెల జోనల్ స్థాయిలో కమిటీ సమావేశం అవుతుందని వెటర్నరీ అధికారి వివరించారు. మేయర్ ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి సంబంధిత అధికారికి అందజేశారు. ప్రతి దరఖాస్తు పై తీసుకున్న చర్య పై అర్జీదారునికి లిఖిత పూర్వకంగా పంపించాలని, అదే విధంగా నివేదిక ను శనివారంలోగా అందజేయాలని జోనల్ కమిషనర్ పంకజను ఆదేశించారు.

ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు తమ వార్డులోని సమస్యలను మేయర్‌కు విన్నవించారు. రాధ, వెంకటేశ్వర రెడ్డి, పవన్ కుమార్‌లు వార్డులో అభివృద్ధి, ఇతర సమస్యల పై మేయర్‌కు వివరించగా వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. కార్పొరేటర్లు వివరించిన పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేయర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ పంకజ, మెయింటెనెన్స్ ఎస్.ఈ అశోక్ రెడ్డి, డిసిలు, టౌన్ ప్లానింగ్, ఎంటమాలజి, వెటర్నరీ, శానిటేషన్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.