AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్.. జాగ్రత్తగా ఉండాలంటూ అధికారుల వార్నింగ్..

Weather Inference for AP: దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకుని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ప్రాంతం ఇప్పుడు..

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్.. జాగ్రత్తగా ఉండాలంటూ అధికారుల వార్నింగ్..
Ap Rains 5
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 17, 2021 | 5:28 PM

Weather Inference for AP: దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకుని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ప్రాంతం ఇప్పుడు ఒడిశా తీరం, వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ వెల్లడించారు. సంబంధిత ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి నైరుతి దిశలో ఎత్తుతో వంగి ఉంటుందన్నారు. రానున్న 48 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందన్నారు. ఇక ఉత్తర, దక్షిణ ద్రోణి ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం నుండి ఉత్తర తమిళనాడు వరకు ఉన్న అల్పపీడన ప్రాంతం అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందన్నారు.

దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇవాళ ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుందన్నారు. అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుందన్నారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలల్లోనూ ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇక పెనుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు.. గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు. బుధవారం నాడు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. పెనుగాలులు గంటకు 40 నండి 50 కిలోమీటర్లు.. గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు. గరువారం నాడు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుందన్నారు.

ఇక ఈరోజు దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. బుధవారం నాడు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంటుందన్నారు. గురువారం నాడు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు.

రాయలసీమలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. కర్నూల్ జిల్లాలో ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. బుధవారం నాడు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురుస్తాయన్నారు. గురువారం నాడు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల పడే ఛాన్స్ ఉందని చెప్పారు.

ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు సంభవించేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. అటవీ పనులకు వెళ్లిన ప్రజలు వర్షం వచ్చే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు.

Also read:

NRI Marriage: అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమంటాడు, సెలవుల్లో వచ్చి పెళ్లి చేసుకుంటాడు. తీరా చూస్తే..

AP Corona Cases: తగ్గుతున్నట్లే తగ్గి.. మరోసారి.. 24 గంటల్లో 1,000 దాటిన కరోనా కేసులు

Twitter Bird: ”ట్విట్టర్ పిట్ట వేపుడు”.. ఎక్కడో కాదు మన ఏపీలోనే.. అసలు కథేంటో తెలుసా.?

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు