AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati News: గరుడవారధి ఫ్లైఓవర్ పేరు మారుతోంది.. కొత్తగా నిర్ణయించిన పేరు ఇదే..

Garuda Varadhi: తిరుపతిలో నిర్మిస్తున్న గరుడవారధి పేరు మారింది. శ్రీనివాససేతుగా మారుస్తూ తిరుపతి కార్పొరేషన్ కౌన్సిల్‌లో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అటు ఈ ఫ్లైఓవర్‌ను అలిపిరి వరకు పొడిగించాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది.

Tirupati News: గరుడవారధి ఫ్లైఓవర్ పేరు మారుతోంది.. కొత్తగా నిర్ణయించిన పేరు ఇదే..
Garuda Varadhi
Sanjay Kasula
|

Updated on: Aug 17, 2021 | 5:42 PM

Share

తిరుపతిలో నిర్మిస్తున్న గరుడవారధి పేరు మారింది. శ్రీనివాససేతుగా మారుస్తూ తిరుపతి కార్పొరేషన్ కౌన్సిల్‌లో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అటు ఈ ఫ్లైఓవర్‌ను అలిపిరి వరకు పొడిగించాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. ఈ అంశాన్ని ఇంజినీరింగ్ విభాగం పరిశీలిస్తోందని ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే గరుడవారధి పేరుమార్పుపై తెలుగు దేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే పూర్తి కథనంలోకి వెళ్లితే… తిరుపతిలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు గరుడ వారధి ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. మొత్తం 684 కోట్ల వ్యయంతో రూపొందుతోంది ఈ ఎలివేటెడ్ కారిడార్.

2021 మార్చి నాటికి పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ కొవిడ్ కారణంగా నిర్మాణ పనులు కొంతకాలం వాయిదా పడ్డాయి. దీంతో మరో 6 నెలలు గడవు పొడిగించారు. 33 శాతం స్మార్ట్‌ సిటీ నిధులు, 67 శాతం టీటీడీ నిధులతో ఈ 7 కిలోమీటర్ల వారధి నిర్మాణం జరుగుతోంది.  మధ్యలో పలువివాదాలు తలెత్తాయి. నిధుల కేటాయింపు, మంజూరులోనూ కొంత జాప్యం జరిగింది.. ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్ని వేగవంతం చేయాలని భావిస్తున్నారు అధికారులు.

అటు కేవలం కపిలతీర్థం వరకే కాకుండా..అలిపిరి వరకు పొడిగించాలన్న ప్రతిపాదనలు కూడా వచ్చాయి. ఈ అంశాన్ని TTD ఇంజినీరింగ్ విభాగం పరిశీలిస్తున్నట్లు ఛైర్మన్ YV సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు గరుడవారధి పేరుని శ్రీనివాససేతుగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు.

తిరుపతి MLA భూమన కరుణాకర్‌రెడ్డి ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించి.. తీర్మానం చేసింది కౌన్సిల్. గరుడ వారధి పేరును ఎందుకు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. తిరుపతి కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ సభ్యుడు బహిష్కరించాడు. దీంతో 48 మంది వైసిపి కార్పొరేటర్లు ఆ పేరు మార్పును ఆమోదించేశారు.

అయితే గరుడవారధి పేరు మార్పుపై తెలుగుదేశం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.. గతంలో పలుపేర్లు పరిశీలించాకే గరుడవారధి పేరుని ఖరారు చేశామని చెబుతున్నారు. శ్రీనివాససేతుగా మార్చాలన్న తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి కార్పొరేషన్ ఎదుట నిరసన చేపట్టారు.

ఈనెల 19న వాచీల వేలం..

టీటీడీ ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో హుండీల ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను ఈనెల 19న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్‌ ద్వారా ఈ–వేలం వేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాటా, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్‌ కంపెనీలకు చెందిన వాచీలు మొత్తం 38 లాట్లు ఉన్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయం 0877–2264429 నంబర్‌లో.. www.tirumala.org రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్‌ www.konugolu.ap.gov.in వెబ్‌సైట్‌లో గానీ సంప్రదించాలని సూచించారు.