NRI Marriage: అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమంటాడు, సెలవుల్లో వచ్చి పెళ్లి చేసుకుంటాడు. తీరా చూస్తే..

Groom Cheats: అమెరికాలో సాఫ్టవేర్‌ ఉద్యోగం, నెలకు రూ. లక్షల్లో జీతం.. ఇలాంటి అబ్బాయికి అమ్మాయిని ఇవ్వడానికి ఏ పేరెంట్స్‌ వెనుకడుగు వేస్తారు చెప్పండి. తల్లిదండ్రుల ఈ బలహీనతనే తనకు బలంగా..

NRI Marriage: అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమంటాడు, సెలవుల్లో వచ్చి పెళ్లి చేసుకుంటాడు. తీరా చూస్తే..
Nri Cheating
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 17, 2021 | 5:08 PM

Groom Cheats: అమెరికాలో సాఫ్టవేర్‌ ఉద్యోగం, నెలకు రూ. లక్షల్లో జీతం.. ఇలాంటి అబ్బాయికి అమ్మాయిని ఇవ్వడానికి ఏ పేరెంట్స్‌ వెనుకడుగు వేస్తారు చెప్పండి. తల్లిదండ్రుల ఈ బలహీనతనే తనకు బలంగా మార్చుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. మాయమాటలతో మహిళలను మోసం చేస్తూ నిత్య పెళ్లికొడుకు అవతారమెత్తాడు గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా క్రోసూరు మండలానికి చెందిన ఓ యువకుడు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం, రూ. లక్షల్లో జీతమంటూ సదరు యువకుడి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు కుదురుస్తుంటారు. సెలవుల్లో వచ్చి వివాహం చేసుకుంటాడు. తీరా నెల రోజుల పాటు కాపురం చేసి అమెరికా వెళ్లిపోతాడు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి మళ్లీ భార్యను తీసుకెళ్తానని నమ్మించి ఉడాయిస్తాడు. ఇలా సాగుతుందీ నిందితుడి వ్యవహారం. దీనికి తల్లిదండ్రులు కూడా మద్ధతు తెలపడంతో అతగాడి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు.

తాజాగా ఇలాగే మోసపోయిన ఎంబీఏ చదివిన యువతి డొంక లాగడంతో అమెరికా నిత్య పెళ్లికొడుకు బాగోతం బయటపడింది. గుంటూరుకు చెందిన ఎంబీఏ చదివిన యువతితో సంబంధం కుదుర్చుకుని రూ.25 లక్షలను కట్నంగా తీసుకుని 2019లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. నెలపాటు ఆమెతో కాపురం చేసి.. కొద్దిరోజులయ్యాక అమెరికా తీసుకెళ్తానంటూ నమ్మించి వెళ్లిపోయాడు. ఇంకెప్పుడు తీసుకెళ్తారని ఫోన్‌ చేసినా స్పందన లేదు. అనుమానం వచ్చిన బాధితురాలు అత్తమామలను అడిగితే పొంతన లేని సమాధానాలు వచ్చాయి. దీంతో తల్లిదండ్రుల సహకారంతో విచారిస్తే గతంలో ఇదే తరహా వివాహాలు చేసుకుని మోసం చేసినట్లు కేసులున్నాయని తెలిసింది.

ఒకటి కాదు రెండు కాదు..

నిజానికి నిందితుడు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది నిజమే. అమెరికాలో గ్రీన్‌కార్డు కలిగిన ఒక యువతిని వివాహమాడాడు. అనంతరం విశాఖకు చెందిన ఓ మహిళను వివాహమాడి ఆమెను విడిచిపెట్టాడు. అనంతరం ఆమె బంధువును పెళ్లి చేసుకున్నాడు. ఆమెను కూడా ఏదో కారణంతో వదిలించుకున్నాడు. తర్వాత నరసరావుపేటకు చెందిన మరొకరిని వివాహమాడాడు. ఈ మహిళను కూడా మోసం చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతని పాస్‌పోర్టు సీజ్‌ చేశారు. అయితే తర్వాత ఆమెతో రాజీ చేసుకొని పాస్‌పోర్టు తీసుకొని మళ్లీ అమెరికా వెళ్లిపోయాడు. ఇక 2019లో మళ్లీ ఇండియాకు వచ్చిన ఈ ప్రబుద్ధుడు తాజాగా గుంటూరుకు చెందిన ఎంబీఏ యువతిని మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడు. నెల తర్వాత తీసుకెళ్తానంటూ అమెరికా వెళ్లిపోయాడు. అయితే ఈ కేటుగాడు ఇంతటితో ఆగలేదు విజయవాడకు చెందిన మరో యువతిని వివాహం చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏడాది డిసెంబర్‌లో వచ్చి నిశ్చితార్థం చేసుకుంటానని మాటిచ్చాడు. గుంటూరు యువతి ఫిర్యాదుతో ఈ నిత్య పెళ్లి కొడుకు బాగోతం ఇలా బయటపడింది.

Also Read: OMG: కూర్చున్నచోట కూర్చున్నట్లే.. గుండెపోటుతో కానిస్టేబుల్ హఠాన్మరణం

Heartbreaking Video: మా బాధను ఎవరూ పట్టించుకోరు.. కంటతడి పెట్టిస్తున్న ఆఫ్ఘన్ యువతి.. వీడియో

Goa Beach: గోవా బీచ్‌లో అర్ధనగ్నంగా మహిళ మృతదేహం.. హత్యేనంటున్న కుటుంబీకులు, మహిళా సంఘాలు