AP Corona Cases: తగ్గుతున్నట్లే తగ్గి.. మరోసారి.. 24 గంటల్లో 1,000 దాటిన కరోనా కేసులు
ఏపీలో కరోనా తీవ్రత కాస్త తగ్గినట్టుగా కనిపిస్తుంది. కొత్తగా 59,198 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1,063 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య..
ఏపీలో కరోనా తీవ్రత కాస్త తగ్గినట్టుగా కనిపిస్తుంది. కొత్తగా 59,198 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1,063 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,92,774కు చేరింది. మరో 11 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. ఈ మరణాలతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13671 కి చేరింది. కొత్తగా 24 గంటల వ్యవవధిలో 1,929 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 19,62,762కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 16,341 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. చిత్తూరు జిల్లాలో అత్యధిక కేసులు(211) వెలుగుచూశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 1.9 % గా ఉంది.
కొనసాగుతున్న కర్ఫ్యూ..
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కర్ఫ్యూ కొనసాగుతోంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటి వరకు అమలు చేస్తున్న రాత్రి కర్ఫ్యూను ఈనెల 21 వరకు కొనసాగించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమల్లో జరుగుతోంది. కొవిడ్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
#COVIDUpdates: 17/08/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,92,774 పాజిటివ్ కేసు లకు గాను *19,92,774 మంది డిశ్చార్జ్ కాగా *13,671 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 16,341#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/s1oLVGlC0O
— ArogyaAndhra (@ArogyaAndhra) August 17, 2021
కరోనా సమాచారం ఇక నుండి మీ చేతుల్లోనే:
● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి. ● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు ● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు ● వెబ్ సైట్ ద్వా రా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు. ● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app. క్రింద లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి.
యాంటిజెన్ టెస్ట్ కిట్ల ఎగుమతిపై ఆంక్షలు:
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం.. కోవిడ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. అయితే కరోనా సమస్య ఇప్పుడే ముగిసిపోలేదని.. థర్డ్ వేవ్ ప్రమాదం ఇంకా పొంచిఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో రోజూవారిగా నమోదవుతున్న కేసులు సైతం కొంతమేర కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా వైరస్ నిర్ధారించేందుకు ఉపయోగిస్తున్న ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కిట్ల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. థర్డ్‌వేవ్ ప్రమాదం పొంచిఉందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం ఎగుమతి విధానాలను సవరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
కోవిడ్-19 యాంటీజెన్ టెస్ట్ కిట్ల ఎగుమతులపై ఆంక్షలు విధిస్తున్నట్లు స్పష్టంచేసింది. వీటిని తక్షణమే ఆంక్షల కేటగిరీలో చేర్చుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (డీజీఎఫ్‌టీ) ట్వీట్టర్ వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాంటిజెన్ కిట్లనే ఎక్కువగా కొవిడ్ పరీక్షల కోసం వినియోగిస్తున్నారు. ఆర్‌టీపీసీఆర్ పరీక్షా ఫలితాల కంటే.. వేగంగా ఫలితాలు వస్తుండటంతో అందరూ యాంటిజెన్ కిట్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌టీపీసీఆర్ పరీక్షల కోసం ప్రయోగశాలలు అందుబాటులో లేకపోవడంతో.. యాంటిజెన్ కిట్లు కీలకంగా మారాయని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా థర్డ్‌వేవ్‌కు అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఈ కిట్‌ల లభ్యతను పెంచేందుకు కేంద్రప్రభుత్వం కిట్ల ఎగుమతిని ఆంక్షల జాబితాలో చేర్చింది. ఆంక్షల కేటగిరిలో ఉంచిన వస్తువులను ఎగుమతి చేయాలంటే ఎగుమతిదారులు డీజీఎఫ్‌టీ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి: Postal Life Insurance: తక్కువ పెట్టబడితో ఎక్కువ భద్రత.. పోస్టాఫీసులో అదిరిపోయే ఇన్సూరెన్స్ ప్లాన్..