Political Fight: నందిగామలో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ.. గందరగోళంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశం
అది వాణిజ్యానికి సంబంధించి చర్చించే వేదిక. కానీ దానికి రాజకీయ రంగు అంటుకుంది. చివరకు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగే వరకు వచ్చింది సిచ్యుయేషన్. కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలో...
అది వాణిజ్యానికి సంబంధించి చర్చించే వేదిక. కానీ దానికి రాజకీయ రంగు అంటుకుంది. చివరకు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగే వరకు వచ్చింది సిచ్యుయేషన్. కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలో ముక్కోటి మహా మండపంలో ఏర్పాటు చేసిన ది చాంబర్ ఆఫ్ కామర్స్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణ చేసుకుంటూ ఇరు వర్గాలు నెట్టుకుని వరకు వచ్చింది. శాసనసభ్యులు మొండితోక జగన్మోహనరావును చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఆహ్వానించలేదని, గడిచిన రెండు సంవత్సరాలలో ఆయన పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించలేదని ఓ వర్గం వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేను సభా కార్యక్రమాలకు అతిథులుగా పిలవలేదని అభినందన, సన్మాన కార్యక్రమాలు జరపలేదని వాదించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన విధంగా ఎందుకు జరగటం లేదని వైసీపీ నాయకులు ప్రశ్నించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ వర్తక వాణిజ్య వ్యాపార సముదాయాల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసుకుందని మరోవర్గం వారు ఎదురు దాడికి దిగారు.
అయితే, గతంలో ఎమ్మెల్యేగా ఉన్న తంగిరాల సౌమ్యను అతిథులుగా పిలిచారని, మర్యాదగా వ్యవహరించారని వైసీపీ నాయకులు గుర్తుచేశారు. అలాంటప్పుడు ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావును సమావేశాలకు ఎందుకు పిలవరని, ఎందుకు సత్కరించరని ప్రశ్నంచారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలకు నచ్చజెప్పారు. సమావేశ మందిరం నుంచి అందరినీ పంపేశారు.
ఇవి కూడా చదవండి: Aadhaar Card: ఈ సంగతి మీకు తెలుసా.. మీ ఆధార్ కార్డుతో పర్సనల్ లోన్స్ తీసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకోండి …