Srisailam Temple: శ్రీశైలంలో పర్యటిస్తున్న టూరిజం సెంట్రల్ కమిటీ.. ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన..
భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ మీనాక్షి శర్మ నేతృత్వంలోని అధికారుల శ్రీశైలంలో పర్యటించింది.

Srisailam Temple: భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ మీనాక్షి శర్మ నేతృత్వంలోని అధికారుల శ్రీశైలంలో పర్యటించింది. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను వారు దర్శించుకున్నారు. ఆ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ బృందం పర్యటనలో భాగంగా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రసాదం పథకం కింద శ్రీశైల క్షేత్రానికి మంజూరు చేసిన నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వారు పరిశీలిస్తారు. ఈ అధికార బృందం ఇవాళ అంతా శ్రీశైలం మహాక్షేత్రంలోనే పర్యటించనున్నారు. కాగా, దేశ వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రసాదం పథకం కింద నిధులను ఏటా మంజూరు చేస్తోంది. ఈ నిధులతో ఆయా ఆలయాల్లో అధికారులు అభివృద్ధి పనులు చేపడుతారు.
Also read:
బీజేపీకి షాక్… మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ రాజీనామా….
