Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు తగ్గిన కేటాయింపులు.. ఈ సారి ఎన్ని కోట్లంటే?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు తగ్గాయి. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిధులు గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గి రూ. 3,320 కోట్లకు చేరాయి. అయితే, అమరావతి, సహజ వ్యవసాయం, రహదారుల నిర్మాణాలకు ప్రపంచ బ్యాంక్, జర్మన్ బ్యాంక్, ఎన్‌డిబి, ఏఐఐబి వంటి అంతర్జాతీయ సంస్థల నుండి సుమారు రూ. 1437 కోట్లకు పైగా అప్పులు లభించనున్నాయి.

ఆదివారం ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టి 2026-27 కేంద్ర ఆర్థిక బడ్జెట్‌లో ఏపీకి పెద్దగా కేటాయింపులు ఏమి జరగలేదు. కొన్ని జరిగినప్పటికీ గత ఆర్థిక బడ్జెట్‌తో పోల్చుకుంటే ఈ సారి తక్కువగానే ఉన్నాయి. పోలవరం విషయంలో చూసుకుంటే గతేడాది పోల్చుకుంటే ఈ ఏడాది ఆర్థిక బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గాయి. గత ఏడాది బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు రూ. 5,936 కోట్లు కేటాయించగా ఈ సారి బడ్జెట్‌లో మాత్రం కేవలం రూ. 3,320 కోట్ల కేటాయింపులు మాత్రమే జరిగాయి.
అలాగే గత ఏడాది బడ్జెట్‌ను కేంద్ర జలశక్తిశాఖ 3,017 కోట్ల రూపాయలకు సవరించిగా పోలవరం వాటర్ స్టోరేజి లెవల్ ను 41.15 మీటర్లకు కుదించినట్లు మరోసారి వెల్లడైంది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి గత ఏడాది 4.32 కోట్ల రూపాయలు కేటాయింపులు జరగ్గా ఈ సారి మాత్రం కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే కేటాయించింది.
ఇక ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర బడ్జెట్‌లో వివిధ అంతర్జాతీయ బ్యాంకుల అప్పుల ద్వారా కేటాయింపులు జరిగాయి. అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్‌మెంట్‌ప్రాజెక్టుకు వరల్ట్ బ్యాంక్ నుంచి 432 కోట్ల రూపాయల అప్పు ఇవ్వనుంది. అలాగే ఏపీ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టుకు జర్మనీ బ్యాంకు నుంచి 155 కోట్ల రూపాయల అప్పు అందనుంది. ఏపీ రోడ్ అండ్ బ్రిడ్జెస్ రీకనస్ట్రక్షన్స్ ప్రాజెక్టుకు ఎన్‌డిబి నుంచి రూ. 350 కోట్ల అప్పు.. ఏపీ రూరల్ రోడ్ ప్రాజెక్టకు ఏఐఐబి నుంచి 500 కోట్ల రూపాయల అప్పులు అందనున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
