AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Main 2026 Application: మరికాసేపట్లో జేఈఈ మెయిన్ తుది విడత రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

ప్రతిష్టాత్మక ఎన్ఐటీ, టాప్‌ ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్‌, బీఆర్క్ కోర్సుల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్‌ 2026 సెషన్‌ 2 పరీక్షల ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 1 (ఆదివారం) నుంచి ప్రారంభంకానున్నాయి. తాజాగా జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు ముగిసి..

JEE Main 2026 Application: మరికాసేపట్లో జేఈఈ మెయిన్ తుది విడత రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
JEE Main 2026 Session 2 registration
Srilakshmi C
|

Updated on: Feb 01, 2026 | 3:29 PM

Share

హైదరాబాద్‌, ఫిబ్రవరి 1: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఎన్ఐటీ, టాప్‌ ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్‌, బీఆర్క్ కోర్సుల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్‌ 2026 సెషన్‌ 2 పరీక్షల ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 1 (ఆదివారం) నుంచి ప్రారంభంకానున్నాయి. తాజాగా జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. జనవరి సెషన్ పరీక్షలు జనవరి 21, 22, 23, 24, 28, 29 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక తుది విడత పరీక్షలకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి విడత పరీక్షలు రాసిన వారు కూడా మలి విడత దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు సెషన్లలో బెస్ట్‌ స్కోర్‌ను అంతిమంగా పరిగణనలోకి తీసుకుంటారు.

జేఈఈ మెయిన్‌ 2026 తుది విడత ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ క్రమంలో జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1కు దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవల్సిన అవసరం లేదు. పాత ఐడీతోనే లాగిన్ అయి సెషన్ 2 పరీక్షకు ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. అయితే మొదటిసారి దరఖాస్తు చేసుకునే వారు మాత్రం తమ పేరు, ఫోటో, సంతకం వంటి వివరాలను కొత్తగా రిజిస్టర్ చేసుకోవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 25, 2026వ తేదీతో ముగియనుంది. ఇక జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 9వ తేదీవరకు ఆన్‌లైన్‌ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

ఫిబ్రవరి మూడో వారం నాటికి దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. అనంతరం అప్లికేషన్ కరెక్షన్‌ విండో ఫిబ్రవరి చివరి వారంలో ఓపెన్‌ అవుతుంది. కాగా జేఈఈ మెయిన్‌ పరీక్షలో ర్యాంకు సాధించిన తొలి2.50 లక్షల మంది మాత్రమే ఎన్టీయే నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అనుమతిస్తుంది. ఇక ఇప్పటికే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 23 నుంచి అంటే జేఈఈ మెయిన్‌ ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే ప్రారంభం అవుతుంది. ఈ మేరకు ఇటీవల ఐఐటీ రూర్కీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 పూర్తి నోటిఫికేషన్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు భారీగానే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో 13, ఆంధ్రప్రదేశ్‌లో 24 చొప్పున పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా