Viveka Murder Case: వివేక హత్య కేసులో సీబీఐ దూకుడు.. పులివెందులలో భాస్కర్ రెడ్డి అరెస్ట్..
భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సీబీఐ అధికారులు. తెల్లవారుజామునే 2 వాహనాల్లో 10 మందికిపైగా అధికారులు అక్కడి చేరుకున్నారు. భాస్కర్‌రెడ్డి సోదరుడు మనోహర్‌రెడ్డిని లోపలికి..
వివేక హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఆదివారం తెల్లవారుజామున పులివెందులలో అవినాష్ రెడ్డి ఇంటికి సీబీఐ బృందం చేరుకుంది. అదే సమయంలో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సీబీఐ అధికారులు. తెల్లవారుజామునే 2 వాహనాల్లో 10 మందికిపైగా అధికారులు అక్కడి చేరుకున్నారు. భాస్కర్‌రెడ్డి సోదరుడు మనోహర్‌రెడ్డిని లోపలికి అనుమతించలేదు CBI అధికారులు. ఈ విషయం తెలిసిన వెంటనే భాస్కర్‌రెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున అభిమానులు, వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నివాసంలో ఉంటున్నారు ఎంపీ అవినాష్‌రెడ్డి. ఇవాళ నియోజకవర్గంలో కార్యక్రమాలకు హాజరుకావాల్సిన అవినాష్‌రెడ్డి.
వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని 4 సార్లు ప్రశ్నించారు సీబీఐ అధికారులు. ప్రస్తుతం పులివెందులలోని నివాసంలో ఉన్న అవినాష్ తండ్రి భాస్కర్‌రెడ్డి. ఇవాళ గడప గడపకు కార్యక్రమం ప్లాన్ చేసుకున్న అవినాష్‌రెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డి. వివేక హత్య కేసులో రెండు రోజుల క్రితం కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్.వివేకానందారెడ్డి మర్డర్‌కేసులో ఉదయ్‌కుమార్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. వెంటనే మాసబ్‌ట్యాంక్‌లోని జడ్జి ఇంటి నుండి ఆయన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని జడ్జి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి అతనికి ఈనెల 26 వరకూ రిమాండ్ విధించారు. వైఎస్. వివేకానందారెడ్డి హత్యకేసులో ఉదయ్‌కుమార్‌ను విచారణ కోసం సీబీఐ కస్టడీ పిటిషన్ వేసింది. మరోవైపు ఉదయ్‌కుమార్ తరఫున నోటీసులు తీసుకున్న ఆయన న్యాయవాదులు బెయిల్ మంజూరు చేయాలని మెజిస్ట్రేట్‌ను కోరారు. అయితే సోమవారం కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ చేస్తామని కోర్టు తెలిపింది.
YS వివేకా హత్య జరగిన సందర్భంలో ఎవరెవరు ఉన్నారనే దానిపై సీబీఐ సేకరించిన గూగుల్ టేక్ ఔట్ లో ఉదయ్ కుమార్‌కి సంబంధించిన వివరాలు ఉండడంతో సీబీఐ ఆయన్ని అదుపులోకి తీసుకుంది. గత మూడు రోజులుగా సీబీఐకి చెందిన 15 మంది సభ్యుల బృందం కడపలో మకాం వేసి ఉయద్‌కుమార్‌ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
గంగిరెడ్డి ఆసుపత్రిలో పనిచేసే జయప్రకాష్ రెడ్డి, కుమారుడు యూసిఎల్ ఉద్యోగి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సీబీఐ వారి స్టేట్ మెంట్ రికార్డు చేసింది. గతంలో విచారణ పేరుతో సీబీఐ తనని వేధిస్తోందని ఉదయ్‌కుమార్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీరామ్‌సింగ్‌పై కడప కోర్టులో ప్రైవేట్ కేసు సైతం దాఖలు చేశారు.
లైవ్ వీడియో కోసం ఇక్కడ చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం