Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish Cultivation: మనిషిని గంటల వ్యవధిలోనే అమాంతం తినేసే చేపలు.. ఏపీలో ఫుడ్డు పెట్టి మరీ పెంచుతున్న వైనం..

పెంచేది మామూలు చేపలను కాదు.. ప్రమాదకర డేంజర్‌ ఫిష్‌. పైగా వాటికి మేతగా కోళ్ల వ్యర్ధాలు, జంతు కళేబరాలు వేస్తూ చేపల సాగు చేస్తోంది ఫిష్ మాఫియా. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం పాత అన్నసముద్రంలో..

Fish Cultivation: మనిషిని గంటల వ్యవధిలోనే అమాంతం తినేసే చేపలు.. ఏపీలో ఫుడ్డు పెట్టి మరీ పెంచుతున్న వైనం..
Catfish Cultivation
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 31, 2023 | 12:26 PM

ఎకరం, రెండెకరాలు కాదు ఏకంగా 30 ఎకరాల్లో చేపల చెరువులు.. పెంచేది మామూలు చేపలను కాదు.. ప్రమాదకర డేంజర్‌ ఫిష్‌. పైగా వాటికి మేతగా కోళ్ల వ్యర్ధాలు, జంతు కళేబరాలు వేస్తూ చేపల సాగు చేస్తోంది ఫిష్ మాఫియా. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం పాత అన్నసముద్రంలో పెద్దఎత్తున క్యాట్ ఫిష్ సాగు జరుగుతోంది. నిషేధిత చేపల సాగుతో పాత అన్నసముద్రంలో భయాందోళనలు నెలకొన్నాయ్‌. భూగర్భ జలాలు కలుషితమైపోవడంతోపాటు గ్రామం మొత్తం కంపుకొడుతోంది. రెండేళ్లుగా బహిరంగంగా ఫంగస్ చేపల పెంపకం సాగుతున్నా పట్టించుకోవడం లేదు అధికారులు. గ్రామస్తులు ఫిర్యాదు చేసినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.

గ్రామస్తుడు రాజేశ్వర్రావు ఫిర్యాదుతో కోళ్ల వ్యర్ధాలు, జంతు కళేబరాల లారీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిషేధిత చేపలను సాగు చేస్తున్నారని ఎన్నిసార్లు కంప్లైంట్‌ చేసినా పట్టించుకోవడం లేదంటున్నాడు గ్రామస్తుడు రాజేశ్వర్రావు.

క్యాట్ ఫిష్ ఎందుకంత ప్రమాదమంటే..

ఇది కుళ్ళిన మాంసాన్ని తిని పెరిగే చేప క్యాట్ ఫిష్. ఈ క్యాట్ ఫిష్‌ను సుప్రీంకోర్టు ఎప్పుడో దీన్ని నిషేదిత జాబితాలో చేర్చింది. కానీ గతంలో చాటుమాటుగా ఈ క్యాట్ ఫిష్ పెంపకాలు జరిగేవి.. ఇప్పుడు కొందరు అక్రమార్కులు దర్జాగా చేపల చెరువుల పేరుతో వీటిని పెంచుతున్నారు. కుళ్ళిన మాంసమే ప్రధాన ఆహరంగా పెరిగే ఈ క్యాట్ ఫిష్.. ఇలా కుళ్ళిన మాంసం తిని కేవలం ఆరునెలల్లోనే ఇరవై కేజీల బరువు వరకు పెరుగుతుంది. ఈ క్యాట్ ఫిస్‌ను ఎందుకు డెడ్లీ ఫిష్ అంటారు.

ఈ చేపలున్న కుంటలు లేదా చెరువులో జంతువులు దిగితే వాటిని కూడా చంపితినేస్తాయి రెండు రోజుల్లో పూర్తిగా తినేస్తాయి. అంతెందుకు  మనుషులు ఎవరైన వీటికి చిక్కితే వారిపై దాడి చేసి మొసలికంటే వేగంగా వారిని తినేస్తాయి. ఈ చేపల పెంపకంతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమవుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

కొరమీను పేరుతో మార్కెట్లోకి..

అందుకే సుప్రీంకోర్టు దీనిని నిషేదించింది. కానీ.. అక్రమంగా పెంచి కోరమీను పేరుతో అమ్మేస్తున్నారు. కొరమీనుకు క్యాట్ ఫిష్‌కు మధ్య చిన్న తేడా మాత్రమే ఉంటుంది. చూడటానికి రెండింటిలో ఒకటే తేడా.. ఈ క్యాట్ ఫిష్‌కు పొడగాటి మీసాలుంటాయి. నోరు కూడా చాలా పెద్దగా ఉంటుంది. అంతే, మిగిలిన అంతా సేమ్ టు సేమ్.

ఈ క్యాట్ ఫిష్ తింటే.. 

ఈ చేపలను తింటే పాటు తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. క్యాట్ ఫిష్ లో ఉండే ఒమేగా ఫ్యాట్ 6 ఆమ్లాలతో నరాల వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది. ఇక దీన్ని తినేప్పుడు ఈ క్యాట్ ఫిష్ దవడ కింద ఉన్న ముల్లు తినేవారి ప్రాణాలకు వెంటనే ప్రమాదం ఉంటుంది. అంత డేంజర్.. డేడ్ ఫిస్ మన తెలుగు రాష్ట్రాల్లో పెంచుతున్నారంటే.. వీటిని పెంచి మన స్థానిక మార్కెట్లో అమ్ముతుంటారు. చేపల ప్రియులూ..! తస్మాత్ జాగ్రత్త.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం