బ్యాంకు లాకర్లలో ఉన్న బంగారం ఏమైంది.. వెలుగులోకి మహా మోసం.. కస్టమర్లకు అసలు విషయం తెలిసి..

కాకినాడలో మరో బ్యాంక్ మోసం వెలుగు చూసింది. సూర్యారావుపేట యూకో బ్యాంకులో పనిచేస్తున్న అప్రైజర్ గోల్డ్ లోన్ మోసం వెలుగు చూసింది. బ్యాంక్ అధికారులు లాకర్ తనిఖీల్లో లేటుగా గుర్తించారు.

బ్యాంకు లాకర్లలో ఉన్న బంగారం ఏమైంది.. వెలుగులోకి మహా మోసం.. కస్టమర్లకు అసలు విషయం తెలిసి..
Gold
Follow us

|

Updated on: Jan 31, 2023 | 11:40 AM

కాకినాడలో మరో బ్యాంక్ మోసం వెలుగు చూసింది. సూర్యారావుపేట యూకో బ్యాంకులో పనిచేస్తున్న అప్రైజర్ గోల్డ్ లోన్ మోసం వెలుగు చూసింది. బ్యాంక్ అధికారులు లాకర్ తనిఖీల్లో లేటుగా గుర్తించారు. బ్యాంకు సిబ్బంది ఇచ్చిన కంప్లైంట్‌పై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో బ్యాంక్ అధికారుల పాత్రపై పోలీసులు విచారిస్తున్నారు. కస్టడీ పిటిషన్ వేసి ముద్దాయిల నుంచి మరిన్ని వివరాలు సేకరించడానికి సిద్ధం అవుతున్నారు. అప్రైజర్ శ్రీనివాస్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. 30 మంది పేర్లపై 60 సార్లు 8 కేజీల 316 గ్రాములు బంగారం తాకట్టు పెట్టినట్లు గుర్తించారు. దాని విలువ దాదాపు 2 కోట్ల 50 లక్షల రూపాయలుగా అంచనా వేశారు.

నకిలీ బంగారం బ్యాంక్‌లో పెట్టి సొమ్ములు నొక్కేశారు కేటుగాళ్లు శ్రీనివాస్, రాంబాబు, కొండరాజు. నిందితుల నుంచి ప్రాథమిక సమాచారం సేకరించిన పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు యత్నిస్తున్నారు. దాదాపు ఏడాది న్నరగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు తేలింది. తెలిసిన వారిని నకిలీ బంగారం తీసుకురమ్మని దానిని చెక్ చేసి ఒరిజినల్‌గా నిర్దారించినట్లు తేలింది. ఇందులో పాత్రదారులుగా గమనించిన పోలీసులు.. 30 మందికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్‌లను పరిశీలిస్తున్నారు.

ఏ విధంగా ఫ్రాడ్ జరిగిందని తేల్చేందుకు బ్యాంక్‌లో ఉన్న మొత్తం బంగారం పరిశీలించనున్నారు. మరోవైపు అప్రైజర్ మోసం వెలుగుచూడటంతో బ్యాంక్ కస్టమర్స్ ఆందోళన చెందుతున్నారు. లాకర్‌లో పెట్టుకున్న తమ బంగారం పరిస్థితి ఏంటని చెక్ చేసుకుంటున్నారు. డబ్బులు పూర్తిగా చెల్లిస్తేనే బంగారం చూపిస్తామని అధికారులు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి

జనం మాత్రం అసలు బంగారం ఉందో లేదో తెలియక ఆందోళన చెందుతున్నారు. బ్యాంక్‌ నుంచి తీసుకెళ్లిన డబ్బులు ఎక్కడ ఉన్నాయి? వాటిని ఏ విధంగా రికవరీ చేయాలనే లెక్కలు తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. మొత్తానికి యూకో బ్యాంక్‌ను, కస్టమర్స్‌ని బురిడీ కొట్టించాడు గోల్డ్ అప్రైజర్ శ్రీనివాస్.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..