AP Politics: అధికారపక్షం క్లారిటీగానే ఉంది.. కానీ విపక్షాల నుంచే క్లారిటీ మిస్ అవుతోంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. విపక్షాల పొత్తులపై అంతులేని అయోమయం నెలకొంది. ఎవరు ఎవరితో ఉన్నారో అస్సలు తెలియడం లేదు. అసలు పొత్తులుంటాయోలేదో తెలియని గజిబిజి గందరగోళం. టీడీపీ, జనసేన, బీజేపీ స్ట్రాటజీ ఏంటో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు కార్యకర్తలు.
అధికారపక్షం క్లారిటీగానే ఉంది!, కానీ విపక్షాల నుంచే క్లారిటీ మిస్ అవుతోంది!. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలినివ్వమంటారు!, కలిసి ముందుకెళ్తామంటారు!. కానీ, ఎవరు ఎవరితో ఉన్నారో తెలియదు!. కలిసే ఉన్నట్టు కనిపిస్తారు, అంతలోనే తీవ్ర ఆరోపణలు చేసుకుంటారు!. తెలుగుదేశం, జనసేన, బీజేపీ… ఈ మూడు పార్టీలదీ అదే తీరు. అసలు ఈ పార్టీల స్ట్రాటజీ ఏంటో అంతుపట్టడం లేదు ఆంధ్రా ఓటర్లకి!. కలిసి పోటీ చేస్తారా? లేక విడివిడిగా బరిలోకి దిగుతారా? మొత్తం గందరగోళమే!
వైనాట్ 175, ఇదీ వైసీపీ పెట్టుకున్న లక్ష్యం. ఇప్పుడిదే మాట టీడీపీ నుంచి కూడా వినిపిస్తోంది. వైసీపీ బాటలోనే వైనాట్ 175 అంటోంది తెలుగుదేశం. జనసేన అధినేత పవన్ కూడా ఇదే తరహా డైలాగ్స్ వినిపిస్తున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక్కడే, ఏదో తేడా కొడుతోంది. మొన్నటివరకూ పొత్తులతోనే ముందుకెళ్తామన్న పవన్, ఇప్పుడు సడన్‌గా అధికారం ఇవ్వండని అడగడం పొత్తులను ప్రశ్నార్ధకం మార్చేశాయ్!.
బీజేపీ, జనసేన మిత్రపక్షాలు, కానీ ఈ రెండు పార్టీల మధ్య ప్రస్తుతం అలాంటి పరిస్థితి అస్సలు కనిపించడంలేదు!. పోనీ, జనసేన-టీడీపీ కలిసి పోటీ చేస్తాయా? అంటే అదీ చెప్పలేని సిట్యువేషన్!. అసలు టీడీపీ, జనసేన, బీజేపీ వ్యూహం ఏంటో అర్ధంకాక బుర్రలు బద్దలుగొట్టుకుంటున్నారు జనం. ప్రజలకే కాదు పొలిటికల్ అనలిస్టులకు కూడా అంతుపట్టడం లేదు ఈ మూడు పార్టీల స్ట్రాటజీ ఏంటో!. అంత అయోమయంగా ఉంది విపక్షాల వ్యూహం!
పొత్తులుంటాయ్! కచ్చితంగా కలిసే పోటీ చేస్తామ్!. వారాహి టూర్‌కి ముందువరకూ పవన్ నోట నుంచి పదేపదే వచ్చిన మాటలు. కానీ, వారాహి టూర్ మొదలయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. వారాహి టూర్‌లో పొత్తులపై ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా పవన్ నోట నుంచి రాలేదు!. అదే టైమ్‌లో చంద్రబాబు నోట నుంచి వైనాట్ 175 డైలాగ్ రావడం పొత్తులను గందరగోళంలో పడేశాయ్!.
టీడీపీ-జనసేన మధ్య పరిస్థితి ఇలాగుంటే, ఇంకోవైపు తెలుగుదేశం-బీజేపీ మధ్య హాట్ అండ్ హీట్ డైలాగ్ వార్ నడుస్తోంది. చంద్రబాబు ఢిల్లీకెళ్లి… నడ్డా, అమిత్‌షాను కలిసొచ్చినా… ఏపీలో మాత్రం టీడీపీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. దాంతో, ఈ రెండు పార్టీలు దగ్గరైనట్టేఅయ్యి దూరందూరంగానే ఉంటాయ్!. ఏపీలో ఇదీ విపక్షాల పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మహా అయితే ఇంకా ఏడెనిమిది నెలల టైముంది!. మరి, ఇప్పుడైనా ఈ మూడు పార్టీలూ తమ వ్యూహామేంటో క్లారిటీ ఇస్తాయోలేదో!.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..