Andhra: కుష్ఠు వ్యాధి పదాన్ని తొలగించేందు చట్ట సవరణ.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
ఏపీలోని ఆటో, క్యాబ్ డ్రైవర్లకు పెద్ద ఉపశమనం. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం విజయవాడలో రూ.15,000 ఆర్థిక సాయం పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇదే కేబినెట్ సమావేశంలో లిఫ్ట్ పాలసీ, అమరావతి భూసేకరణ, పర్యాటక ప్రాజెక్టులు, చట్టసవరణలు సహా 20 కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Andhra Cabinet Meeting
ఆంధ్రప్రదేశ్‌లోని ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం అందించే పథకానికి వేళయింది. పండుగ వేళ.. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం లాంఛనంగా ఈ స్కీమ్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం విజయవాడ సింగ్ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించే అకకాశం ఉంది. ఈ పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది, ఇందులో 20 అజెండా అంశాలు చర్చించారు.
కేబినెట్ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు:
- ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ 2024-29 అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- జలవనరుల శాఖకి సంబంధించిన వివిధ పనుల కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- కారవాన్ పర్యాటక ప్రాజెక్ట్, అమృత్ పథకం 2.0 పనులకు ఆమోదం.
- రాజధాని అమరావతి భూసేకరణ: ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వని భూములను భూసేకరణ ద్వారా తీసుకోవడానికి ఆమోదం.
- అమరావతి వివిధ పనుల వేగవంతానికి స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) ఏర్పాటు.
- రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలకు భూకేటాయింపు ప్రతిపాదనలకు ఆమోదం.
- కుష్ఠు వ్యాధి పదాన్ని తొలగించేందుకు చట్టసవరణ చేస్తామని నిర్ణయం.
- విద్యుత్ శాఖకు సంబంధించిన వివిధ ప్రతిపాదనలు, అలాగే కార్మిక చట్టాల్లో సవరణలు మంత్రివర్గం ఆమోదించింది.
- గతంలో ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉంటే పోటీ చేసే అనర్హతను నీటి సంఘాల ఎన్నికల నుంచి మినహాయింపుకు కేబినెట్ ఆమోదం
- హంద్రీ నీవాలో అమిద్యాల లిఫ్ట్ పనుల పునరుద్ధరణ
- ప్రకాశం బ్యారేజ్, దివిసీమలలో వరద నష్టం పనులకు ఆమోదం
- వైఎస్సార్ కడప జిల్లాలో మైలవరం రిజర్వాయర్‌కి 3.19 కోట్లతో మరమ్మత్తులు
- తిరుమల, తిరుపతికి నీటి ప్రాజెక్ట్ కోసం 126 కోట్లకు కేబినెట్ ఆమోదం




