AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: రైల్వే ట్రాక్ పక్కన ఏదో కాలిన ఆనవాళ్లు.. ఎంక్వైరీ చేయగా పోలీసులు షాక్.!

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పాపను అడ్డుస్తొందన్న అక్కసుతో చంపేసింది. తను, తన ప్రియుడు దొరకకుండా ఉండాలని ఏకంగా మంటల్లో కాల్చివేసింది. చేసిన పాపం బయటకు తెలియకుండా ఉండాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. చుట్టుపక్కల వాళ్ల అనుమానం.. పోలీసులకు ఉప్పందించింది.

AP News: రైల్వే ట్రాక్ పక్కన ఏదో కాలిన ఆనవాళ్లు.. ఎంక్వైరీ చేయగా పోలీసులు షాక్.!
Representative Image
T Nagaraju
| Edited By: |

Updated on: Feb 14, 2024 | 4:55 PM

Share

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పాపను అడ్డుస్తొందన్న అక్కసుతో చంపేసింది. తను, తన ప్రియుడు దొరకకుండా ఉండాలని ఏకంగా మంటల్లో కాల్చివేసింది. చేసిన పాపం బయటకు తెలియకుండా ఉండాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. చుట్టుపక్కల వాళ్ల అనుమానం.. పోలీసులకు ఉప్పందించింది. దీంతో చివరికి తల్లిని, ప్రియుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.

ఊరు కాని ఊరు వచ్చారు. ఇద్దరూ అనోన్యంగా ఉంటున్నారు. ఆరేళ్ల పాప కూడా ఉంది. అంతా బాగానే ఉందని ఊరి జనం కూడా అనుకున్నారు. కానీ ఆ కసాయి తల్లి కళ్లలో కనికరంలేమిని కనిపెట్టలేకపోయారు. అంతా అయిపోయిన తర్వాత అసలు విషయం తెలిసి అయ్యో.! పాపం అనుకోవడం తప్ప.. ఏమి చేయలేని నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఆమె పేరు స్వప్న.. ఊరు హైదరాబాద్‌లోని లాలాగూడా.. అతని పేరు. సిద్దార్ధ్.. ఊరు కర్నూలు జిల్లా ఆలూరు. వీరిద్దరికి పరిచయం అయింది హైదరాబాద్‌లో.. కూలీ పనుల నిమిత్తం ఆలూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లిన సిద్దార్ధ్‌కు అక్కడ స్వప్న పరిచయం అయింది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటికే వివాహం అయిన స్వప్నకు ఆరేళ్ల కూతురుంది. హైదరాబాద్‌లో తమ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ జీవించడం కష్టంగా మారింది. దీంతో వీరిద్దరూ ఆరేళ్ల పాపను తీసుకొని తాడికొండ మండలం బండారుపల్లి వచ్చారు. వచ్చి ఇరవై ఐదు రోజులైంది.

అయితే ఆరు రోజుల క్రితం బండారుపల్లిలోని రైల్వే ట్రాక్ పక్కన ఏదో కాలిన ఆనవాళ్లు కనిపించాయి. కూలీ పనులు నిమిత్తం అటుగా వెళ్తున్న వారికి అక్కడ ఏం తగులబెట్టారో అర్ధం కాకుండా ఉంది. దీంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే స్వప్న, సిద్దార్ధ్‌ల వద్ద ఉండాల్సిన ఆరేళ్ల పాప కనిపించకపోవడంతో స్థానికులుకు అనుమానం వచ్చింది. ట్రాక్ పక్కన కాల్చివేసింది చిన్నారినే అన్న అనుమానం బలపడింది. వెంటనే స్థానికులు ఈ విషయాన్ని తాడికొండ పోలీసులకు చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఇక్కడకి ఎందుకొచ్చారు. చిన్నారిని చంపాలన్న ఉద్దేశం ముందే ఉందా..? ఎలా చంపారు.? అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంతోనే కన్నబిడ్డను కసాయి తల్లే ప్రియుడితో కలిసి చంపిదన్న ప్రాధమిక నిర్ధారణకు పోలీసులు వచ్చారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
3 మ్యాచ్ లు 61 పరుగులు.. వన్డే ప్రపంచకప్ స్వ్కాడ్ నుంచి ఔట్..?
3 మ్యాచ్ లు 61 పరుగులు.. వన్డే ప్రపంచకప్ స్వ్కాడ్ నుంచి ఔట్..?
కోటి బడ్జెట్ తో రూ.11 కోట్ల కలెక్షన్లు.. నిర్మాత ఏం చెప్పారంటే..
కోటి బడ్జెట్ తో రూ.11 కోట్ల కలెక్షన్లు.. నిర్మాత ఏం చెప్పారంటే..
గుప్త నవరాత్రులు ప్రారంభం.. ఈ తప్పులు అస్సలు చేయకండి
గుప్త నవరాత్రులు ప్రారంభం.. ఈ తప్పులు అస్సలు చేయకండి