ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలం… సభా సంప్రదాయలను పాటించని బాబు.. స్పీకర్‌తోనూ అనుచిత వ్యవహారశైలి…

' ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని, సభా సంప్రదాయాలకు విలువ ఇవ్వకుండా అసెంబ్లీలో స్పీకర్‌ను, మండలిలో ఛైర్మన్‌ను చుట్టుముట్టారు’ అని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలం... సభా సంప్రదాయలను పాటించని బాబు.. స్పీకర్‌తోనూ అనుచిత వ్యవహారశైలి...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 05, 2020 | 3:39 PM

‘ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని, సభా సంప్రదాయాలకు విలువ ఇవ్వకుండా అసెంబ్లీలో స్పీకర్‌ను, మండలిలో ఛైర్మన్‌ను చుట్టుముట్టారు’ అని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి శనివారం బొత్స మీడియాతో మాట్లాడారు.టీడీపీ సభ్యులు కేవలం ఘర్షణ కోసమే అసెంబ్లీకి వచ్చారని ఆరోపించారు. సభా నియమాలు పాటించకుండా బాబు పోడియం వద్ద బైఠాయించారని తెలిపారు. స్పీకర్‌ను బెదిరించేలా అనుచితంగా మాట్లాడారని తప్పుపట్టారు. స్పీకర్‌పై చంద్రబాబు వ్యక్తిగత దూషణలకు దిగి సభను అపహాస్యం చేశారని విమర్శించారు.

అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని వివరించామని బొత్స సత్యనారాయణ అన్నారు. 5కోట్ల 65లక్షల మంది లబ్ధిదారులకు రూ.67వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. ఏడాదిన్నర పాలనలో చేసిన సంక్షేమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లెక్కలతో సహా చూపించారని అన్నారు. పోలవరం ఎత్తుపై ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా పోలవరం ఎత్తును ఒక్క సెం.మీ కూడా తగ్గించలేదని సీఎం చెప్పారని’ బొత్స తెలిపారు.

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!