AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుట్టెడు దుఃఖంలోనూ మహోన్నత సేవ.. కుటుంబ పెద్ద మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం!

కుటుంబ పెద్ద మృతి అనంతరం పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల విద్య అభ్యాసం కోసం రంగరాయ మెడికల్ కాలేజీకి ఓ కుటుంబం దానం చేసింది. సాంప్రదాయలు దాటి మృతదేహాన్ని వైద్య విద్య కోసం త్యాగం చేసిన ఆదర్శప్రాయుడు బిక్కిన వీర్రాజు భౌతిక కాయాన్ని సందర్శించిన వందలమంది జనాలు. మరణ అనంతరం తమ దేహాన్ని ఉపయోగించుకోమని దేహదానం చేసే ఆదర్శవాదులకు పునర్జన్మరాహిత్య ప్రాప్తి కలుగుతుందని ప్రగాఢ నమ్మకం..

పుట్టెడు దుఃఖంలోనూ మహోన్నత సేవ.. కుటుంబ పెద్ద మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం!
Family Donates Body Of 84 Year Old Man In East Godavari District
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: May 13, 2026 | 4:50 PM

Share

కాకినాడ, మే 13: తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఒక మహోన్నత సేవగాథ అందరి హృదయాలను కదిలిస్తోంది. మండపేటకు చెందిన దేహదాత, ఆదర్శప్రాయుడు బిక్కిన వీర్రాజు శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. వ్యవసాయ కుటుంబానికి చెందిన వీర్రాజు జీవితం చివరి దశలో కూడా సమాజానికి ఉపయోగపడే గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మరణానంతరం తన దేహాన్ని వైద్య విద్యార్థుల అభ్యాసం కోసం దానం చేయాలని ముందుగానే ఒప్పంద పత్రాలపై సంతకం చేసి తన మహోన్నత మనసును చాటుకున్నారు. ఆయన కోరిక మేరకు కుటుంబ సభ్యులు కూడా పూర్తి సహకారం అందించి, రంగరాయ మెడికల్ కళాశాలకు ఆయన పార్థివ దేహాన్ని నిబంధనల ప్రకారం అందజేస్తున్నారు.

బిక్కిన వీర్రాజు భౌతిక కాయాన్ని సందర్శించేందుకు వందలాది మంది తరలివచ్చి నివాళులు అర్పిస్తున్నారు. సంప్రదాయాలకు అతీతంగా సమాజ ప్రయోజనం కోసం తన దేహాన్ని అంకితం చేసిన ఆయన నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. వైద్య విద్యలో మానవ శరీర నిర్మాణంపై అవగాహన కోసం దేహదానం ఎంతో కీలకం. ఇటువంటి దాతల దేహాలను “సైలెంట్ టీచర్స్”గా వైద్య కళాశాలలు గౌరవిస్తాయి. ప్రతి అవయవం, ప్రతి భాగం వైద్య విద్యార్థులకు అధ్యయనానికి ఉపయోగపడుతుంది. అందుకే దేహదానం అత్యున్నత మానవతా సేవగా భావించబడుతోంది. హిందూ ధర్మశాస్త్రాల్లో కూడా దేహదానంపై ఎటువంటి నిషేధం లేదని పండితులు చెబుతున్నారు. దధీచి మహర్షి తన దేహాన్ని లోకకళ్యాణం కోసం అర్పించినట్లే, ఆధునిక కాలంలో దేహదానం కూడా మహాదానంగా పరిగణించబడుతోంది. మరణం అనేది శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదని గరుడ పురాణం వివరిస్తుంది. ఆత్మ శాశ్వతమైందని, మానవ సేవ కోసం చేసిన త్యాగం మహా పుణ్యఫలాన్ని ఇస్తుందని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి.

తండ్రి చివరి కోరికను గౌరవిస్తూ, లాభాపేక్ష లేకుండా దేహాన్ని వైద్య విద్య కోసం దానం చేసిన బిక్కిన కుటుంబ సభ్యుల సేవాభావం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. నేత్రదానం, అవయవదానం, దేహదానాలు పవిత్రమైనవి. ఇవి సమాజానికి వెలుగునిచ్చే మహోన్నత సేవలు. ఆదర్శ దేహదాత బిక్కిన వీర్రాజు పునర్జన్మ రాహిత్య శాశ్వత కైవల్య ప్రాప్తి కలగాలని పరమేశ్వరుణ్ని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేద్దాం!

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
పెద్దాయన మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం చేసిన కుటుంబ సభ్యులు
పెద్దాయన మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం చేసిన కుటుంబ సభ్యులు
40 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంటర్ పరీక్ష.. విద్యార్థిగా మారిన మాజీ మావో
40 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంటర్ పరీక్ష.. విద్యార్థిగా మారిన మాజీ మావో
నేడు ఆర్సీబీతో కీలక పోరు.. కేకేఆర్ ప్లేఆఫ్స్ చేరాలంటే ఏం జరగాలి?
నేడు ఆర్సీబీతో కీలక పోరు.. కేకేఆర్ ప్లేఆఫ్స్ చేరాలంటే ఏం జరగాలి?
హృదయ విదారక ఘటన.. వీధిలో ఏదో వస్తువును పీక్కుతింటున్న కుక్కలు!
హృదయ విదారక ఘటన.. వీధిలో ఏదో వస్తువును పీక్కుతింటున్న కుక్కలు!
అందం మాత్రమే కాదు, అదృష్టం కూడా పెంచే డ్రీమ్ క్యాచర్ రహస్యం!
అందం మాత్రమే కాదు, అదృష్టం కూడా పెంచే డ్రీమ్ క్యాచర్ రహస్యం!
కేతు గ్రహణ యోగం.. ఈ రాశుల వారు కన్నీళ్లతో కాలం గడపాల్సిందే..
కేతు గ్రహణ యోగం.. ఈ రాశుల వారు కన్నీళ్లతో కాలం గడపాల్సిందే..
25 ఏళ్లకే అమెరికాలో సంచలనం సృష్టించిన పులివెందుల కుర్రాడు..
25 ఏళ్లకే అమెరికాలో సంచలనం సృష్టించిన పులివెందుల కుర్రాడు..
ఇంటర్‌ ఫెయిల్.. నేడు 250 కోట్ల వ్యాపారానికి బాస్..!
ఇంటర్‌ ఫెయిల్.. నేడు 250 కోట్ల వ్యాపారానికి బాస్..!
బ్రహ్మానందం రేటు పెంచడంతో ఆయనను రంగంలోకి దింపారు.. కట్ చేస్తే
బ్రహ్మానందం రేటు పెంచడంతో ఆయనను రంగంలోకి దింపారు.. కట్ చేస్తే
ఐపీఎల్ క్రేజ్‎ను క్యాష్ చేసుకుంటున్న కేటుగాళ్లు
ఐపీఎల్ క్రేజ్‎ను క్యాష్ చేసుకుంటున్న కేటుగాళ్లు