BJP-TDP Alliance: పొత్తు ఓకే..! కానీ ఈ అసెంబ్లీ సీట్లు కావాలంటున్న బీజేపీ.. లిస్ట్ మీరు చూశారా..?

ఏపీలో అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడంపై ఫోకస్ చేస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం పొత్తుల విషయంలోనే ఇంకా కసరత్తు కొనసాగిస్తోంది. జనసేనతో పొత్తులో ఉన్నామంటున్న కమలం నేతలు.. టీడీపీతో పొత్తుపై తర్జనభర్జన పడుతున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్ అప్ డేట్ బయటకు వచ్చింది. పొత్తులో భాగంగా 20 అసెంబ్లీ సీట్లు కావాలని బీజేపీ కోరుతుందట..

BJP-TDP Alliance: పొత్తు ఓకే..! కానీ ఈ అసెంబ్లీ సీట్లు కావాలంటున్న బీజేపీ.. లిస్ట్ మీరు చూశారా..?
AP BJP
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: Feb 16, 2024 | 7:19 PM

ఆంధ్రప్రదేశ్, ఫిబ్రవరి 16:  ఏపీ రాజకీయాల్లో పొత్తులపై సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖాయమైనా.. ఆ కూటమిలో బీజేపీ చేరుతుందా? లేదా ? అనే ఉత్కంఠకు మాత్రం తెరపడటం లేదు. టీడీపీతో పొత్తులో ఉన్నప్పటికీ జనసేనతో తమ పొత్తు ఇప్పటికీ కొనసాగుతోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో చర్చలు జరిపారు. ఆ చర్చల సారాంశం ఏంటి అన్నది మాత్రం తెలియలేదు. ఆ వెంటనే జగన్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. మోదీ, అమిత్‌షాలతో భేటీ అయిన జగన్.. అక్కడ ఏం మాట్లాడారు.. ఏపీ రాజకీయాల ప్రస్తావన వచ్చిందా? అన్న విషయాలపై ఇప్పటికీ క్లారిటీ లేదు. అటు, పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ టూర్‌ ఎప్పుడనేది కూడా సస్పెన్స్‌గా మారింది. ఈ మధ్య మంగళగిరి పార్టీ ఆఫీస్‌లోనే ఉంటున్న పవన్‌ కల్యాణ్‌ సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. అయితే టీడీపీ, జ‌న‌సేన వెంట బీజేపీ రావాల‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కోరుకుంటున్నారు. టీడీపీ, జ‌న‌సేన‌తో క‌లిసి బీజేపీ పొత్తు పెట్టుకుంటుంద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఏపీలో బీజేపీ 20 అసెంబ్లీ సీట్లు అడుగుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. ఆ సీట్ల వివరాలు ఇప్పుడు చూద్దాం…

  1. రాజమండ్రి సిటీ
  2. పి గన్నవరం (ఎస్సీ)
  3. కైకలూరు
  4. విజయవాడ సెంట్రల్
  5. గుంటూరు పశ్చిమ
  6. ప్రత్తిపాడు
  7. బాపట్ల
  8. కాకినాడ సిటీ
  9. ఏలూరు
  10. జమ్మలమడుగు
  11. ధర్మవరం
  12. తాడేపల్లిగూడెం లేదా ఉంగుటూరు
  13. తిరుపతి లేదా శ్రీకాళహస్తి
  14. మదనపల్లె
  15. వైజాగ్ నార్త్
  16. అరకు లోయ (ST)
  17. శ్రీకాకుళం లేదా విజయనగరం
  18. నెల్లూరు సిటీ లేదా రూరల్
  19. ఒంగోలు
  20. నర్సరావుపేట

బీజేపీకి పట్టున్న సీట్లను ఎంపిక చేసి.. రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వానికి నివేదిక పంపింది.  బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ పొత్తులపై చర్చ జరిగింది. అడిగిన 20 సీట్లు ఇస్తేనే పొత్తులపై ముందుకనే సంకేతాలు పంపుతోంది బీజేపీ. మరి ఈ ప్రపోజల్‌పై టీడీపీ, జనసేన నుంచి ఎలాంటి రిప్లై వస్తుంది. ఫైనల్ నిర్ణయం ఎలా ఉంటుంది అనేది అతి త్వరలో తేలిపోనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..