Andhra Pradesh: చెబుతున్నా రాసుకో.. మూడు పార్టీల పొత్తులు పక్కా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..

Andhra Pradesh News: ఏపీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది.. అయినప్పటికీ.. ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెట్టి ముందుకుసాగుతున్నాయి. ఇప్పటికే.. ఓ వైపు అధికారపార్టీ.. మరోవైపు ప్రతిపక్షపార్టీలు..

Andhra Pradesh: చెబుతున్నా రాసుకో.. మూడు పార్టీల పొత్తులు పక్కా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..
Ap Politics

Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 13, 2023 | 7:32 PM

Andhra Pradesh News: ఏపీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది.. అయినప్పటికీ.. ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెట్టి ముందుకుసాగుతున్నాయి. ఇప్పటికే.. ఓ వైపు అధికారపార్టీ.. మరోవైపు ప్రతిపక్షపార్టీలు.. జనంలోకి క్షేత్రస్థాయిలో వెళ్లేందుకు యాత్రలు మొదలుపెట్టాయి. ఈ తరుణంలో బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికల్లో పొత్తులు పక్కా .. చెబుతున్నా రాసుకో.. అంటూ బిజెపి నేత ఆదినారణ రెడ్డి పేర్కొన్నారు. కచ్చితంగా మూడు పార్టీల కలయుక జరిగిద్దని.. టీడీపీ, బీజేపీ, జనసేన కలుస్తాయంటూ క్లారిటీ ఇచ్చారు.. మూడు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళతాయని స్పష్టంచేశారు. మా ప్రయేజనాల కోసం కాదు, ప్రజల సంక్షేమం కోసమే మూడు పార్టీలు కలుస్తాయన్నారు. విశాఖలో ఈనెల 16న జేపీ నడ్డా కార్యక్రమం ఉందని.. ఆ రోజు పొత్తులపై ఒక క్లారిటీ వస్తుందని తెలిపారు.

బుధవారం మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి.. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పప్పులు ఇంకా ఉడకనివ్వమని.. ప్రజా శ్రేయస్సు కోసం.. వచ్చే ఎన్నికలలో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలను జగన్ ఏడిపిస్తున్నాడని.. చెల్లెను బయటకు పంపి, చిన్నాన్నను చంపి జగన్ డ్రామాలు ఆడుతున్నారన్నారు. నేషన్ హైవే రోడ్లు తప్ప రాష్ట్రంలో ఒక్క రోడ్డు అయినా వేశారా అని ప్రశ్నించారు. జగన్ కలుపు మొక్క అని.. బిజేపి కలుపుకునే ప్రసక్తే లేదన్నారు. తమ పార్టీ ఈ ప్రభుత్వంపై సీరియస్ గానే ఉందని.. అందుకు మడకశిరలో తమ నాయకుడు కేంద్రమంత్రి నారాయణ స్వామి మాట్లాడిన మాటలే నిదర్శనమని ఆదినారాయణ స్పష్టం చేశారు. ఇప్పటికే నడ్డా, అమిత్ షా రాష్ట్ర పర్యటనలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని, జగన్ కు బిజెపి అండ లేదు దండ లేదని.. ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..